
వైఎస్ జగన్‌కే నా ఓటు : పోసాని
కాకినాడ : రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే బాగుందని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తన ఓటు అని అన్నారు. మెరుగైన సేవ చేసేవారికే ఓటు వేస్తామన్నారు.
ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చేరిన తాను ప్రస్తుతం ఓటరుగానే ఉండిపోయానని పోసాని తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీలేదని... అయితే తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లనని ఓటర్గానే ఉంటానని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ పెట్టబోయే జనసేన పార్టీలో తాను చేరటం లేదని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.