PRP
-
చరిత్ర ఏం చెబుతుందంటే.. విపక్షాలవి పగటి కలలే.!
సాక్షి, ఆంధ్రప్రదేశ్: 1956–2014 మధ్య ఉనికిలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌లో 1982లో తెలుగుదేశం ఏర్పాటయ్యాకే రెండు ప్రధాన రాజకీయపక్షాల మధ్య అధికారం కోసం గట్టి పోటీ జరిగే పరిస్థితులు వచ్చాయి. అంటే, 1983 ఏపీ శాసనసభ ఎన్నికల నుంచి మాత్రమే ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షానికి 30 శాతానికి పైగా ఓట్లు రావడం మొదలైంది. 1953–56 మధ్య మూడేళ్లు ఉనికిలో ఉన్న ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఒకే ఒక ఎన్నికల్లో ప్రతిపక్షానికి పడిన ఓట్లు 30 శాతం దాటాయి. 1955లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)కి 31.13% ఓట్లు దక్కాయి. అయితే, దాదాపు మూడో వంతు శాతం ఓట్లు దక్కించుకున్నాగాని కమ్యూనిస్టులకు ఈ ఎన్నికల్లో మొత్తం 190 సీట్లకుగాను కేవలం 15 స్థానాలే లభించాయి. కాంగ్రెస్ కూటమికి, సీపీఐకి మధ్య దాదాపు అన్ని చోట్లా పోటీ తీవ్రంగా ఉండడమే ఈ అసాధారణ ఫలితాలకు కారణం. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో 1983 ఎన్నికల ముందు వరకూ ఇలా దాదాపు మూడో వంతు ఓట్లు (30%) దక్కించుకున్న ప్రధాన ప్రతిపక్షం ఏదీ లేదు. 1957, 62, 67, 72 ఉమ్మడి ఏపీ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌కు దాదాపు ఎదురులేని పరిస్థితి. ఈ నాలుగు ఎన్నికల్లోనూ చివరి మూడు ఎన్నికలే రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. 1957లో తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 105 స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షమైన సీపీఐ 25.73% ఓట్లతో 22 సీట్లు సంపాదించగలిగింది. విశాల తెలుగురాష్ట్రంలో మొదటిసారి అంతటా జరిగిన 1962 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ అత్యధికంగా 19.13% ఓట్లు సంపాదించి, 51 సీట్లు సాధించింది. అయితే, అప్పటికీ బలహీనపడిన సీపీఐ నాటి ఏపీ అసెంబ్లీలోని మొత్తం 300 సీట్లకు గాను 136 సీట్లలో మాత్రమే పోటీచేయగలిగింది. ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (1967, 1972) ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి కనీసం 10% ఓట్లు దక్కలేదు. 1978 ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ కాసు బ్రహ్మానందరెడ్డి, ఇందిరాగాంధీ నాయకత్వంలో రెండు పార్టీలుగా దేశవ్యాప్తంగా చీలిపోయింది. ఈ చీలిక తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన 1978 ఫిబ్రవరి ఎన్నికల్లో మాత్రమే అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా పార్టీకి రాష్ట్రంలో 28.85 శాతం ఓట్లు, 60 సీట్లు దక్కాయి. (ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (ఆర్) తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు నాయకత్వంలోని పార్టీకి 17% ఓట్లు, 30 సీట్లు దక్కాయి.) ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1983 ఎన్నికలకు ముందు ఒక ప్రతిపక్ష పార్టీకి పాతిక శాతం వరకూ ఓట్లు వచ్చిన ఏకైక సందర్బం ఇదే. మూడో పక్షానికి 15% ఓట్లు దాటిన ఏకైక సందర్భం 2009 అసెంబ్లీ ఎన్నికలే! 1980ల ఆరంభంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం, ప్రధాన ప్రతిపక్షానికి (కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్) ప్రతిసారీ 30 శాతానికి పైగానే ఓట్లు లభించాయి. 1994 ఏపీ పదో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 26 సీట్లు (మొత్తం 294కు) మాత్రమే దక్కించుకున్నప్పుడు కూడా ఈ పార్టీకి పోలైన ఓట్లలో 33.85% వచ్చాయి. ఈ పదో శాసనసభ ఎన్నికల తర్వాత మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలోకి దిగిన ప్రాంతీయపక్షానికి 15 శాతానికి మించిన ఓట్లు లభించిన సందర్భం 2009 అసెంబ్లీ ఎన్నికలే. ఈ ఎన్నికలకు 8 మాసాల ముందు ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)కి 16.2 శాతం ఓట్లు, 18 సీట్లూ ఈ ఎన్నికల్లో లభించాయి. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలోగాని, రెండు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ)గాని మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల పోరుకు దిగిన ఏ పార్టీకి కనీసం 15 శాతం ఓట్లు దక్కలేదు. 2023 నవంబర్–డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ మూడో ఎన్నికల్లో తృతీయ ప్రత్యామ్నాయంగా భావించిన బీజేపీకి గరిష్ఠంగా 13.9 శాతం ఓట్లు, 8 సీట్లూ దక్కాయి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లోనూ (2014, 2019) మూడో ప్రధాన పార్టీగా బరిలోకి దిగిన ఏ రాజకీయపక్షం కూడా కనీసం ఆరు శాతం ఓట్లు సంపాదించుకోలేదు. ఇలా తెలుగునాట రెండు ప్రధాన రాజకీయపక్షాలే ఒకదాని తర్వాత మరొకటి (ఒక్కోసారి వరుసగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాగాని) సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాయేగాని మూడో ప్రత్యామ్నాయ పార్టీకి లేదా కూటమికి అవకాశం ఇవ్వలేదు. విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP ఇవి చదవండి: ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ -
TS Election 2023: మూడింటిలో పీటముడి! తేలాల్సి ఉన్న మూడు స్థానాలు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల వ్యవహారం తేలలేదు. మిగతా నియోజకవర్గాల్లో దాదాపు కొలిక్కి వచ్చినా దేవరకొండ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డినే పోటీలో దింపాలని భావించినా ఆయన తన కుమారుడికే టికెట్ ఇప్పించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇదిలా ఉంటే.. పొత్తులో భాగంగా ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టులకు రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకారానికి వచ్చిందంటూ ప్రచారం సాగుతోంది. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు, మునుగోడు స్థానాన్ని సీపీఐకి ఇస్తున్నారన్న విషయంపై సోమవారం రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయా స్థానాలను ఆశిస్తున్న వారు తీవ్ర ఆందోళనలో పడ్డారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి వర్గం, మునుగోడులో టికెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి వర్గం నిరాశలో పడింది. అయితే, మిర్యాలగూడ, మునుగోడు స్థానాలను ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని కమ్యూనిస్టు పార్టీల నేతలు చెబుతుండగా.. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. తేలాల్సి ఉన్న మూడు స్థానాలు.. ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాల్లో ఎవరిని బరిలో నిలుపాలన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయానికి రానట్లుగా తెలిసింది. అందులో ముఖ్యంగా దేవరకొండ, తుంగతుర్తి స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొనగా, సూర్యాపేటలో ఇద్దరి మధ్యే ప్రధానమైన పోటీ నెలకొంది. దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం ఐదారుగురు ప్రయత్నిస్తున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు గతంలో టీడీపీ, పీఆర్పీలో పనిచేసిన వడ్త్యా రమేష్‌నాయక్, కిషన్‌నాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో రమేష్‌నాయక్ మాజీ మంత్రి జానారెడ్డి ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో పీఆర్పీలో పనిచేసినందున సినీ నటుడు చిరంజీవి ద్వారా కూడా రమేష్ నాయక్ ప్రయత్నాలు చేస్తుండటంతో టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని తేల్చలేదు. ఇక, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, నాగరిగారి ప్రీతమ్, భాషపంగు భాస్కర్, వడ్డేపల్లి రవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ పోటీ అధికంగా ఉండటంతో వెంటనే తేల్చని పరిస్థితి నెలకొంది. ఇక సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చే పనిలోనే అధిష్టానం ఉంది. దీంతో వారిలో ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి రాలేదు. నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తన కుమారుడు జైవీర్‌రెడ్డి అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అవసరమైతే తాను ఎంపీ వెళతానని ప్రకటించారు. దీంతో అక్కడ జానారెడ్డి కూమారునికే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. -
‘మీరు భర్తల్ని మార్చినంత ఈజీగా రాజ్యాంగాన్ని మార్చలేం’
సాక్షి, న్యూఢిల్లీ : పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్ది నాయకులు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేసే నేపంతో కొందరు ‘మగా’నుభావులు మహిళా నాయకుల గురించి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. దాదాపు అన్ని పార్టీల్లోను ఇలాంటి ‘ఉత్తమ’ నేతలున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రపక్షమైన పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ (పీఆర్పీ) నాయకుడొకరు స్మృతి ఇరానీ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. పీఆర్పీకి చెందిన జయదీప్ కవాడే స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ... ‘ఆమె తన నుదురుపై చాలా పెద్ద బిందీని(బొట్టు) ధరిస్తారు. ఇలాంటి వారి గురించి కొందరు నాతో ఏం చెప్పారంటే.. భర్తల్ని మారుస్తున్న కొద్ది మహిళ పెట్టుకునే బిందీ సైజు కూడా పెరుగుతుందట. స్మృతి ఇరానీ పార్లమెంట్లో నితిన్ గడ్కరీ పక్కన కూర్చుని రాజ్యాంగాన్ని మార్చే విషయం గురించి చర్చిస్తుంది. కానీ ఆమె ఓ విషయం తెలుసుకోవాలి.. మీరు భర్తల్ని మార్చినంత ఇజీగా రాజ్యాంగాన్ని మార్చలేము’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని ఉద్దేశిస్తూ.. ఆమె ఫెషియల్ చెయించుకుంటుంది.. జుట్టుకు రంగు వేసుకుంటుంది. అలాంటి ఆమె మోదీ గురించి కామెంట్ చేయడం హాస్యాస్పదం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే నాయకుడు యూపీ డ్యాన్సర్, సింగర్ సప్నా చౌదరి కాంగ్రెస్‌లో చేరినప్పుడు.. గాంధీ కుటుంబం ఆమెకు చాలా చక్కగా సూట్ అవుతుంది. ఎందుకంటే సోనియా గాంధీ కూడా సప్నా చౌదరిలానే డ్యాన్సర్ కదా అంటూ కామెంట్ చేశారు. -
'అందుకే కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేశా'
హైదరాబాద్ : సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆపార్టీ ఎంపీ, సినీనటుడు చిరంజీవి అన్నారు. భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (మహాపరినిర్వాణ్)ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి శనివారం చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం చూసే...తాను ప్రజారాజ్యాన్ని విలీనం చేశానన్నారు. -
కాంగ్రెస్+పీఆర్పీ= టీడీపీ
పీఆర్పీ విలీనమైంది కాంగ్రెస్‌లో కదా! తెలుగుదేశం పార్టీతో ఏమిటి సంబంధం? అనే సందేహం రావచ్చు. సీమాంధ్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ.. పీఆర్పీ, కాంగ్రెస్‌ల కలయికగా రూపాంతరం చెందింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సీమాంధ్ర అభ్యర్థుల మూడో జాబితా పరిశీలిస్తే ఈ విషయం నిజమేననిపించక మానదు. సొంతబలం లేక వలస నాయకుల్ని ప్రోత్సహిస్తున్న టీడీపీ అస్తిత్వాన్ని కోల్పోయి.. ఇతర పార్టీల నాయకులతో ఎన్నికల బరిలో దిగుతోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు యువకులు, విద్యావంతులతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై దూసుకొచ్చుంది. ఒకరిద్దరు మాత్రమే ఇతర పార్టీల నాయకులకు చోటు లభించింది. ఇదంతా గతం. ప్రస్తుతం టీడీపీకి వలస నాయకులే దిక్కు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆ మాటకొస్తే సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు కూడా వలస నాయకుడే. ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు. ఆయన విడుదల చేసిన తాజా జాబితాలో సొంత నాయకుల కంటే.. వలస నాయకుల హవాయే కనిపిస్తోంది! టీడీపీ తాజాగా ముగ్గురు లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించగా వీరిలో ఇద్దరు ఇతర పార్టీల వారే. అనకాపల్లి అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు గత ఎన్నికల్లో పీఆర్పీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటిదాకా మంత్రిగా పనిచేసిన తోట నరసింహానికి కాకినాడ టికెట్ కేటాయించారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో గంగుల ప్రభాకర రెడ్డి, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి, మండలి బుద్ధప్రసాద్, పితాని సత్యనారాయణ, శత్రుచర్ల విజయరామారాజు వంటి పేర్లు ఉన్నాయి. వీరందరూ తాజా మాజీ కాంగ్రెస్ నాయకులే. సీమాంధ్రలో కాంగ్రెస్ గల్లంతు కావడం, టీడీపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో పరస్పర అవసరాలు వీరిని దగ్గరకు చేర్చాయి. ఇక గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ తదితరులు పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌కు, అటు నుంచి టీడీపీ జంప్ అయ్యారు. వీరే కాదు గల్లా ఫ్యామిలీ, జేసీ బ్రదర్స్, రాయపాటి.. ఇలా చెబుతూ పోతే టీడీపీలో సొంత నాయకుల స్థానంలో వచ్చిన వలస నాయకుల జాబితా చాలా ఉంది. ఇన్నేళ్లుగా పార్టీని అంతో ఇంతో బతికించిన తెలుగు తమ్ముళ్లకు మాత్రం చంద్రబాబు పెద్ద చెయ్యే ఇచ్చారు. కమలంతో బలవంతపు పొత్తు, వలస నాయకులతో సైకిల్ ఎటు వెళ్తుందో? వలసల బరువు మోయ లేక పంక్చర్ అవుతుందోనని దేశం నేతలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీని టీసీపీ (తెలుగుదేశం, కాంగ్రెస్, పీఆర్పీ)గా మార్చుకుంటే బాగుంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కొందరివాడుగా మిగిలిపోయిన అందరివాడు
ఐదేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం, తమ అభిమాన నటుడి కోసం నిస్వార్థంగా పనిచేశారు. పాపం అభిమానులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ తరపున ప్రచారం చేశారు. పలు ప్రాంతాల్లో బస్టాపుల వద్ద సిమెంటు బల్లల నిర్మాణం, బస్సు షెల్టర్ల నిర్మాణం, పలు సామాజిక కార్యక్రమాలు.. ఇలా అనేక పేర్లతో డబ్బులు వదిలించుకున్నారు. అయితే పీఆర్పీ నాయకులు ఓట్ల కోసం వారిని వాడుకున్నారు తప్ప వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వినిపించాయి. పార్టీలోనూ వారికి పెద్దగా ఆదరణ లభించలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో పీఆర్పీ చతికిల పడటం.. ఏదో సాధిస్తాడని అనుకున్న చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వంటి పరిణామాలను అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వెండితెరపై మెగాస్టార్‌ను గొప్పగా ఊహించుకున్న అభిమానులకు.. రాజకీయ జీవితంలో ఆయన వైఖరి చూసి భ్రమలు తొలగిపోయాయి. పీఆర్పీ ఆవిర్భావ సమయంలో సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి ఆ తర్వాత సమైక్యాంధ్ర అనడం.. హైదరాబాద్ యూటీ డిమాండ్.. చివరకు కాంగ్రెస్ హైకమాండ్‌కు విధేయత ప్రకటించి విభజనకు పూర్తిస్థాయిలో ఆమోదం తెలపడంతో చాలా మంది అభిమానులు ఆయనకు దూరమయ్యారు. ఒకప్పడు 'అందరివాడు'గా జననీరాజనం అందుకున్న చిరంజీవి ప్రస్తుతం 'కొందరివాడు'గానే మిగిలిపోయారు. కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేశాక చిరంజీవితో పాటు కొంతమంది నాయకులకే అధికారిక, పార్టీ పదవులు దక్కాయి. చాలా మంది నిరాదరణకు గురయ్యారు. ఇక అభిమానుల సంగతైతే చెప్పనక్కర్లేదు. రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి అండతో మంత్రి పదవి పొందిన గంటా శ్రీనివాసరావు సహా గత ఎన్నికల్లో పీఆర్పీ తరపున గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. దీనికితోడు సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తరుణంలో చిరంజీవి ఇటీవల అభిమాన సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, వట్టి వసంతకుమార్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో చిరంజీవి అభిమాన సంఘాల నేతలకు టికెట్లు ఇస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. చిరంజీవి అభిమాన సంఘాలు కాంగ్రెస్‌వైపే ఉండాలని, ప్రచారాల్లో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా, పీసీసీ కార్యవర్గాల్లో వారికి అవకాశం కల్పిస్తామని రఘువీరా రెడ్డి హామీ కూడా ఇచ్చారు. అభిమాన సంఘాలకు ఎక్కడ వీలుంటే అక్కడ టికెట్లు ఇస్తామని చిరంజీవి తెలిపారు. ఓటమి భయంతో పెద్దపెద్ద నాయకులే కాంగ్రెస్ వీడి పోతుంటే అభిమానులను బలిపీఠంపై కూర్చోపెడుతున్నారే గుసగుసలు వినిపించాయి. పైగా ఇన్నాళ్లూ నిరాదరణకు గురైన అభిమానులు ఎన్నికల ముందే కాంగ్రెస్ నాయకులకు గుర్తొచ్చారనే విమర్శలు వచ్చాయి. పాపం అభిమానులపై ఉన్నది 'చిరు' ప్రేమేనా..! -
వైఎస్ జగన్‌కే నా ఓటు : పోసాని
కాకినాడ : రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే బాగుందని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తన ఓటు అని అన్నారు. మెరుగైన సేవ చేసేవారికే ఓటు వేస్తామన్నారు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చేరిన తాను ప్రస్తుతం ఓటరుగానే ఉండిపోయానని పోసాని తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీలేదని... అయితే తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లనని ఓటర్‌గానే ఉంటానని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ పెట్టబోయే జనసేన పార్టీలో తాను చేరటం లేదని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. -
చిరంజీవిని నమ్మిమోసపోయిన వికలాంగుడు
-
పీఆర్పీని పునరుద్ధరించే ఆలోచన లేదు: బండారు
పీఆర్పీని పునరుద్దరించే ఆలోచన చిరంజీవికి లేదని గతంలో పీఆర్పీ నాయకుడు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనేదే సీమాంద్ర ప్రజాప్రతినిధుల అభిప్రాయమని ఆయన వెల్లడించారు. ఆంటోని కమిటీ ముందుకు వెళ్లాలా, వద్దా అనే విషయమై తామంతా చర్చించుకుంటున్నామని, ఆంటోని కమిటీ ముందుకు వెళ్లి, విభజన కుదరదని తెగేసి చెప్పాలనుకుంటున్నామని సత్యానందరావు చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్ర సమస్యలు ఏర్పడుతాయని, అందుకే సమైక్య రాష్ట్రానికి ప్రత్యామ్నాయమే లేదని ఆయన అన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం అవసరమైతే కేంద్ర మంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీ నామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సత్యానందరావు తెలిపారు. -
కోటగిరి విద్యాధరరావు గుండెపోటుతో మృతి