లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆచార్య జగదీష్ | Nalgonda DEO acharya Jagadesh in ACB net | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆచార్య జగదీష్

Published Thu, Mar 13 2014 10:23 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Nalgonda DEO acharya Jagadesh in ACB net

నల్గొండ : అవినీతి నిరోధక శాఖ వల్లో మరో చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఓ జిల్లా విద్యాశాఖాధికారి అడ్డంగా దొరికిపోయాడు. నల్గొండ జిల్లా డీఈవో ఆచార్య జగదీష్ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు డీఈవో లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించటంతో అధికారులు పథకం వేసి లంచం తీసుకుంటుండగా డీఈవోను పట్టుకున్నారు. డీఈవోపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement