లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆచార్య జగదీష్
నల్గొండ : అవినీతి నిరోధక శాఖ వల్లో మరో చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఓ జిల్లా విద్యాశాఖాధికారి అడ్డంగా దొరికిపోయాడు. నల్గొండ జిల్లా డీఈవో ఆచార్య జగదీష్ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు డీఈవో లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించటంతో అధికారులు పథకం వేసి లంచం తీసుకుంటుండగా డీఈవోను పట్టుకున్నారు. డీఈవోపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.