నందిగామ నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఇది రేపటి విజయానికి సంకేతమని ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు.
పచ్చచొక్కాలకు ఓటమి కలవరం
నందిగామ నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఇది రేపటి విజయానికి సంకేతమని ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో తన పట్టు ఏ స్థాయిలో ఉందో తమ పార్టీ నిరూపించిందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీదే పట్టు. అయితే ఈ సారి పరిస్థితి మారింది. తొలిసారి పల్లె ఎన్నికల బరిలో దిగిన వైఎస్సార్ సీపీ తన ప్రజాబల ంతో టీడీపీకి ముచ్చెమటలు పట్టించింది. దీంతో ఒక్కసారిగా పచ్చచొక్కాల్లో కలవరం మొదలైంది. నిన్నటి వరకూ విజయం తమదేనంటూ ఢాంబికాలు పోయిన తెలుగు తమ్ముళ్ల ధైర్యం మేకపోతు గాంభీర్యం చందం అనేది బట్టబయలైంది. అయితే లగడపాటి సర్వే అంచనాలు పచ్చ చొక్కాలకు కాస్త ఊరటనిచ్చాయి.
లగడపాటి మాటలు నమ్మలేమంటూ సొంతవర్గం నేతలే కొట్టిపారేస్తున్నారు. ఇదంతా ఎన్నిక ఫలితాలపై బెట్టింగ్‌లు పెంచేందుకు లగడపాటి మొదలుపెట్టిన మైండ్‌గేమ్‌గా అభివ ర్ణిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలను చూసి సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు పల్లెల్లో ఎదురైన చేదు అనుభవంతో బిత్తరపోయారు. అయినప్పటికీ తమదే గెలుపంటూ ఒకరికొక రు ధ్యైర్యం చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి పెట్టనికోటగా ఉంటూ ఇప్పటి వరకూ అండగా నిలిచిన చందర్లపాడు మండలపరిషత్ పీఠాన్ని తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మండల కేంద్రంలో మూడు ఎంపీటీసీ స్థానాలు గెలిచి టీడీపీకి పట్టున్న పీఠాన్ని కదిలించింది. నందిగామ మండల పరిషత్, జెడ్పీటీసీనూ వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుని నియోజకవర్గ కేంద్రంలో పాగా వేసింది.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావుకు జెడ్పీటీసీగా పట్టంకట్టిన వీరులపాడు మండలం ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఖాతాలో చేరి పోయింది. అక్కడ వైఎస్సార్‌సీపీ బలమైన కేడర్ తమ సత్తా ఏమిటో చాటిచెప్పింది. ఇదే పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృత్తం అవుతుందని వైఎస్సార్ సీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించినందుకు ధన్యవాదాలు
ఇదిలా ఉంటే నందిగామ నియోజకవర్గంలో రెండు జెడ్పిటీసీలు, మూడు మండల పరిషత్‌లలో వైఎస్సార్ సీపీని గెలిపించినందుకు ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు బుధవారం ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు పార్టీని ఆదరించిందనందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు.
నందిగామ జడ్పిటీసీ సభ్యురాలుగా కోవెలమూడి ప్రమీలారాణి గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే పార్టీ నియోజకవర్గ నాయకుడు కోవెలమూడి వెంకటనారాయణ, జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు బొగ్గవరపు శ్రీ శైల వాసు, నాలుగు మండలా, పట్టణ కన్వీనర్‌లు తాటి రామకృష్ణారావు, నెలకుదిటి శివనాగేశ్వరరావు, కోట బుచ్చయ్యచౌదరి, బండి జానకీరామయ్య, కోటేరు ముత్తారెడ్డి, కేడీసీసీ డెరైక్టర్ కొమ్మినేని రవిశంకర్, సహకార సంఘ అధ్యక్షుడు గాడిపర్తి శివాజి, గోళ్లమూడి వెంకటేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంగునూరి కొండారెడ్డి, గుడివాడ సాంబశివరావు, మహ్మద్ మస్తాన్ తదితరులు కూడా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.