సాక్షి, కర్నూలు: జిల్లాలో కర్నూలు తర్వాత అధిక ఆదాయాన్ని ఇచ్చే నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మహానంది, తిరుపతి, అహోబిలం ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు నంద్యాల మీదుగా వెళ్లాల్సిందే. ఇలా నిత్యం రద్దీగా ఉండే ప్రాంగణాన్ని అధికారులు ఆధునికీకరించడం లేదు. బస్టాండుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో యాజమాన్యం ప్రయాణికుల నుంచి సెస్ వసూలు చేస్తోంది. పల్లెవెలుగు మినహా మిగిలిన అన్ని సర్వీసుల్లో టికెట్‌పై ఓ రూపాయి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు వసూలు చేసిన నిధులు ఇంత వరకు అభివృద్ధి కోసం ఒక్క పైసా వెచ్చించలేదు. కర్నూలు రీజియన్‌లో రూ.1.20కోట్లు వసూలై నట్లు సమాచారం. ఇందులో ఎక్కువ మొత్తం నంద్యాల డిపోకు కేటాయించాల్సి ఉంది. బస్టాండ్‌లో సమస్యల గురించి చెప్పుకోవాలంటే దుర్వాసనది మొదటి స్థానం. ఈ బస్టాండ్ చుట్టూ అపరిశుభ్రత నెలకొనడంతో ప్రయాణికులు లోపలికి వెళ్లలేని పరిస్థితి. పందులు అధికంగా సంచరిస్తూ ప్రయాణికుల అడ్డు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. మరుగు నీరు అక్కడే నిల్వ ఉండటంతో రాత్రి వేళలో దోమలు సైర్యవిహారం చేస్తున్నాయి. నిమిషం కూడా నిల్వ లేక పోతున్నారు. ఇక్కడి రెండు మరుగుదొడ్లను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. శుభ్రత విషయంలో నిబంధనలు పాటించడం లేదు. పురుషుల మూత్రశాలలో నీటి సౌకర్యం లేక దుర్గంధాన్ని వెదజల్లుతోంది.
బాప్‌రే..బస్టాండ్ !
Published Thu, Nov 14 2013 12:52 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM
Advertisement
Advertisement