ర్యాలీ నిర్వహిస్తున్నా వామపక్షాలు నేతలు
సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు, వామపక్షాలు కలసి శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించాయి. మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. బైక్, సైకిల్‌పై ర్యాలీలు నిర్వహించారు. నల్ల దుస్తులు, నల్ల జెండలు ధరించి తమ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా దొండపర్తి డీఆర్‌ఎమ్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వేజోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష నేతలు ర్యాలీ చేపట్టగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వామపక్ష రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణతో పాటు సీహెచ్ నర్సింగరావు, సత్యనారాయణ మూర్తి, విమల, మాధవి, ఈశ్వరమ్మతో పాటు వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దేశ సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రధాని రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment