
నవ్యాంధ్ర నిర్మాణంలో అందరి భాగస్వామ్యం
రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
గుంటూరు ఈస్ట్ : నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నవనిర్మాణ దీక్ష చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు నిచ్చారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గురువారం జిల్లా స్థాయిలో నవనిర్మాణ దీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో చేయించే ప్రతిజ్ఞను ఎల్‌ఈడీ స్క్రీన్‌పై చూస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. తొలుత ఎన్టీఆర్ స్టేడియం నుంచి నవనిర్మాణ దీక్ష ర్యాలీని నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన సభలో పుల్లారావు మాట్లాడుతూ 2018 నాటికి రాజధాని, పోలవరం పూర్తి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే మాట్లాడుతూ ఇంకుడుగుంతల నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి , ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్.రామకృష్ణ ,ై మెనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి.హిదాయత్ ,’సంయుక్త కలెక్టర్ -2 వెంకటేశ్వరావు, 20 సూత్రాల కమిటీ చైర్మన్ శ్రీనివాసశేష సాయిబాబా, జీడీసీసీ చైర్మన్ ఎమ్.వెంకటసుబ్బయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ తదితరులున్నారు.