కమిషనరేట్‌కు కొత్తకళ | New innovations in Commissionerate | Sakshi
Sakshi News home page

కమిషనరేట్‌కు కొత్తకళ

Published Sun, Jul 12 2015 1:59 AM | Last Updated on Tue, Aug 21 2018 8:41 PM

New innovations in Commissionerate

- బహుళ అంతస్తు భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు
- కార్యాలయాలు, అధికారులకు భవనాలు
- సర్వే చేపట్టిన కోస్టల్ ల్యాండ్ సంస్థ
- నెలరోజుల్లో స్పష్టత
- అధునాతన భవనాలకు ప్రతిపాదనలు
విజయవాడ సిటీ:
నగర పోలీసు కమిషనరేట్‌ను ఆధునీకరించేందుకు పోలీసుశాఖ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం కమిషనరేట్ ప్రాంగణంలో అధునాతన భవనాలు నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  కమిషనరేట్ ఆధునీకరణపై సర్వేకు ఉన్నత స్థాయి ఆదేశాలు వచ్చాయి. కోస్టల్ లాండ్ సర్వే సంస్థ కమిషనరేట్ స్వరూప స్వభావాలపై సర్వే చేస్తోంది.  కమిషనరేట్‌లో అధికారులు, విభాగాల సంఖ్య పెరిగింది.

ఇందుకు అనుగుణంగా అవసరమైన భవనాలు అందుబాటులో లేవు. 8 ఎకరాల్లో విస్తరించి ఉన్న కమిషనరేట్‌లో నగర పోలీసు కమిషనర్ కార్యాలయం, బంగ్లాతో పాటు డీసీపీలు, అదనపు డీసీపీలు, స్పెషల్ బ్రాంచి, ఫింగర్ ప్రింట్ విభాగాలు ఉన్నాయి. ప్రారంభంలో ప్రస్తుతం శాంతి భద్రతల డీసీపీ కార్యాలయం వేదికగా అర్బన్ ఎస్పీ, ఆ తర్వాత పోలీసు కమిషనర్ విధులు నిర్వహించేవారు. ఆ తర్వాత 1999లో నగర పోలీసు కమిషనర్ కోసం కొత్త కార్యాలయం ఏర్పాటు చేసి సీపీ కార్యాలయాన్ని డీసీపీకి కేటాయించారు. ఇటీవల కాలంలో పరిపాలనా విభాగం డీసీపీతో పాటు వివిధ విభాగాలకు అదనపు డీసీపీలను నియమించారు. ఇక్కడ తగిన వసతులు లేకపోవడంతో ట్రాఫిక్ విభాగాన్ని మహాత్మాగాంధీ రోడ్డులోని కె.ఎస్.వ్యాస్ కాంప్లెక్స్‌కు మార్చారు. చాలీ చాలని వసతులతో వివిధ విభాగాల అధికారులు ఉన్న భవనాల్లోనే  విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నగర పోలీసు కమిషనరేట్‌ను ఆధునీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
బహుళ అంతస్తుల భవనాలు
కమిషనరేట్ ప్రాంగణంలోని ఇప్పుడున్న భవనాల స్థానంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నారు. రాజధాని అవసరాలకు అనుగుణంగా కొత్త భవనాలను ఇక్కడ నిర్మించేందుకు నిర్ణయించారు. కమిషనరేట్‌కు మూడు వైపులా రహదారులు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని అధికారులందరికి అవసరమైన కార్యాలయాలతో పాటు ఉన్నతాధికారుల నివాస భవనాలు కూడా నిర్మించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement