కొత్తసంవత్సరం స్వాగత ఖర్చు రూ.10కోట్లు! | new year welcomes spend Rs 10 crores | Sakshi
Sakshi News home page

కొత్తసంవత్సరం స్వాగత ఖర్చు రూ.10కోట్లు!

Published Thu, Jan 2 2014 4:59 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

new year  welcomes spend Rs 10 crores

 ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్తసంవత్సరానికి స్వాగతం పలికే వేళ జిల్లాలో అన్ని రకాలుగా మొత్తం 10కోట్లరూపాయలకు పైగా వ్యాపారం జరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను మంగళవారం రాత్రి నుంచి అంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకున్నారు. మద్యం, మాంసం, స్వీట్లు, కేక్‌లు, అలంకరణ వస్తువులు, వస్త్రాలు, రంగులు, బాణసంచా, హోటళ్లు ఇలా అన్ని రకాల వ్యాపార కూడళ్లు జనసందోహంతో నిండాయి. మద్యం విషయానికి వ స్తే పల్లె నుంచి పట్టణం వరకు ప్రతీ చోట పొంగిపొర్లింది.
 డిసెంబర్ 31నాడే రూ.2కోట్ల మద్యం అమ్మకాలు
 జిల్లా వ్యాప్తంగా ఒక్క డిసెంబర్ 31 రోజునే సుమారు రూ.2కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానం( ఈ- బిడ్డింగ్)తో అక్రమార్కులకు చెక్ పడుతోంది. దళారీ వ్యాపార వ్యవస్థను రూపుమాపడం, రైతులకు న్యాయమైన ధర కల్పించడం, మార్కెట్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఈ - బిడ్డింగ్’  విధానాన్ని మోడల్‌గా రాష్ట్రంలో ఆరు వ్యవసాయ మార్కెట్లలో ప్రవేశపెట్టిన విషయం విదితమే. వీటిలో ఖమ్మం మార్కెట్ ఒకటి. రూ.50లక్షలతో ఈ విధానాన్ని ఏర్పాటు చేసి నెల రోజులుగా అమలు చేస్తున్నారు. ఈ బిడ్డింగ్‌ను ఏర్పాటు చేసిన ఎన్‌సీడీఈఎక్స్ అనే కంపెనీ సాంకేతిక బృందం సభ్యులు దీనిపై మార్కెట్ అధికారులకు, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. అలాగే పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే కమీషన్ వ్యాపారులకు, ఖరీదుదారులకు కూడా శిక్షణ ఇచ్చారు.
 మొత్తం కంప్యూటర్‌లో నమోదు
 ఈ విధానం వల్ల మొత్తం కంప్యూటర్‌లో నమోదవుతుంది. రైతు సరుకు మార్కెట్‌లోకి రాగానే వివరాలు కంప్యూటర్‌లో నమోదవుతాయి. నిర్ణయించిన సమయంలో కమీషన్ వ్యాపారులు సరుకుకు తాము పెట్టే ధరను ఈ- బిడ్డింగ్‌లో నమోదు చేయాలి. ఈ ధరలు కంప్యూటర్‌లో రహస్యంగా ఉంటాయి. చివరకు ఈ - బిడ్డింగ్ విధానంలో రైతు సరుకుకు అధిక ధర పెట్టిన కమీషన్ వ్యాపారి పేరు, ధర ప్రకటించబడుతుంది. ఆ కమీషన్ వ్యాపారి దడవాయిలకు బిడ్డింగ్ స్లిప్ ఇస్తే ఉదయం 9:30 గంటలకు కాంటాలు పెట్టి స్లిప్పులిస్తారు. కమీషన్ వ్యాపారుల నుంచి సరుకు కొనుగోలు చేసిన ఖరీదు దారుల(ట్రేడర్లు)కు వాహనాల్లో ఆ సరకును బయటకు 11 గంటల తర్వాత పంపుతారు.

సరుకు బయటకు వెళ్లే సమయంలో కూడా ఆయా స్లిప్పులను గేట్ వద్ద కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. ఈ విధానం పటిష్టంగా అమలు జరిగేలా మార్కెట్ కమిటీ చర్యలు చేపట్టింది. గతంలో ఈ విధానం లేకపోవడంతో మార్కెట్‌లోకి కమీషన్ వ్యాపారులు, దళారుల తమ ఇష్టారాజ్యంగా సరుకు కొనుగోళ్లు చేసి బయటకు పంపేవారు. మార్కెట్ సెస్‌ను ఎగ్గొట్టడం కోసం, మార్కెట్ ఉద్యోగులను, అధికారులను బుట్టలో వేసుకొని ‘జీరో’ దందాను నడిపేవారు. దీంతో మార్కెట్‌కు వచ్చే ఆదాయం రాకుండా పోయింది. దళారీ వ్యాపారులు కూడా మార్కెట్‌లోకి చేరి ఎటువంటి ఆధారాలు లేకుండా రైతుల సరుకును కొనుగోలు చేసేవారు. ఈ- బిడ్డింగ్ అమలు చేయటంతో దళారులు మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ ఇటీవల మార్కెట్‌లోకి వచ్చి సరుకు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. మార్కెట్ సెస్‌కు ఎగనామం పెట్టే ఆలోచనలో ఉన్న వ్యాపారులు కూడా ఈ-బిడ్డింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.

తాము ఈ-బిడ్డింగ్ నిబంధనలు అనుసరించ లేమని, ఆయా వేళలు పాటించలేమని మార్కెట్ ఉద్యోగులే ఆ విధులు నిర్వహించాలని గొడవ చేశారు. ఈ- బిడ్డింగ్ అమలు చేయటంతో అక్రమ వ్యాపారుల దందాతో పాటు, దళారీ వ్యవస్థకు కూడా చెక్ పడుతుంది. అవినీతి అక్రమాలకు పాల్పడే కొందరు మార్కెట్ సిబ్బంది, అధికారులకు కూడా ఈ నూతన విధానం మింగుడు పడకుండా ఉంది. ఈ విధానం అమలుతో అక్రమంగా వారికి వచ్చే డబ్బు అందకుండా పోతుంది. ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేసి రాష్ట్రంలో మోడల్‌గా మార్కెట్‌గా ముందుకు తీసుకుపోవటం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తే మార్కెట్ ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆదాయం రూ.12 కోట్లు. వ్యాపారులు, దళారుల నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి లక్ష్యాన్ని సాధించాలని మార్కెట్ కమిటీ ప్రయత్నిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement