జలుమూరు ( శ్రీకాకుళం) : అప్పుడే పుట్టిన మగ శిశువును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై విడిచి వెళ్లిపోయారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం రాణా జంక్షన్‌లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గుర్తించగా.. శిశువు శరీరంపై గాయాలు ఉండడంతో నర్సన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.