రక్షణ కల్పించాలని కోరుతున్న ప్రేమజంట బాలసంగీత, సంతోష్
అల్లిపురం (విశాఖదక్షిణ): చట్టబద్దంగా ఒక్కటైన మేజర్లమైన తమను తల్లిదండ్రులు వేరుచేయాలని చూడటమే కాక, హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారని ప్రేమజంట బాల సంగీత, సంతోష్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో గురువారం వారు మహిళా చేతన్ అధ్యక్షురాలు కత్తి పద్మతో కలసి వివరాలు వెల్లడించారు.
బాలసంగీత నగరంలోని గాయత్రి విద్యాపరిషత్‌లో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు నగరంలోని తాటిచెట్లపాలేనికి చెందిన ఎం. సంతోష్‌బాబుతో ఫేస్‌బుక్‌లో పరిచయం కుదిరింది. అతను బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరి ప్రేమవ్యవహారం తెలిసిన బాల సంగీత కుటుంబ సభ్యులు అబ్బాయి కులం వేరని చెప్పి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులిద్దరూ గత నవంబర్ 19న నగరంలో ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారు. తరువాత ఆ ప్రేమ జంట తమ పెళ్లిని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నారు.
విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు తమ పరువు తీసిందని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. యువతి ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment