tatichettlapalem
-
పరువు తీసిందని.. చంపేస్తామంటున్నారు
అల్లిపురం (విశాఖదక్షిణ): చట్టబద్దంగా ఒక్కటైన మేజర్లమైన తమను తల్లిదండ్రులు వేరుచేయాలని చూడటమే కాక, హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారని ప్రేమజంట బాల సంగీత, సంతోష్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో గురువారం వారు మహిళా చేతన్ అధ్యక్షురాలు కత్తి పద్మతో కలసి వివరాలు వెల్లడించారు. బాలసంగీత నగరంలోని గాయత్రి విద్యాపరిషత్‌లో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు నగరంలోని తాటిచెట్లపాలేనికి చెందిన ఎం. సంతోష్‌బాబుతో ఫేస్బుక్లో పరిచయం కుదిరింది. అతను బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరి ప్రేమవ్యవహారం తెలిసిన బాల సంగీత కుటుంబ సభ్యులు అబ్బాయి కులం వేరని చెప్పి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులిద్దరూ గత నవంబర్ 19న నగరంలో ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారు. తరువాత ఆ ప్రేమ జంట తమ పెళ్లిని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు తమ పరువు తీసిందని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. యువతి ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
'బాబు పదేపదే టీవీల్లో కనిపించడానికే చూస్తున్నారు'
విశాఖ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం విశాఖలోని ఏకేసీ, ఏఎస్సీసీ కాలనీల్లో హుదూద్ తుపాన్ బాధితుల్ని పరామర్శించిన జగన్.. చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పదే పదే టీవీల్లో కనిపించడానికే పరిమితం అవుతున్నారని విమర్శించారు. బాధితులకు ఏమీ చేయకుండా ఏదో చేసినట్లు కలర్ పూసి మాయ చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. తమ వద్దకు ఎవరూ రాలేదని తుపాను బాధితులు ఏకరువు పెట్టడంపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారపొట్లాలను పంచే క్రమంలో బాధితులంతా లారీ దగ్గరకు వెళితే.. ఆ పొట్లాలను విసిరివేయడాన్ని తప్పుబట్టారు. అసలు బాధితులను ఆదుకోవాలంటే ఎంతైనా చేయొచ్చని జగన్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లతో నడుస్తున్నప్పుడు తుపాను బాధితులపై శ్రద్ద వహించకపోవడం సిగ్గు చేటన్నారు. ఇళ్లు పైకప్పులన్నీ ఎగిరిపోయి నిరాశ్రయులగా ఉన్న తమ వద్దకు ఎవరూ రాలేదని బాధితుల గోడు వెళ్లబోసుకున్నారని జగన్ పేర్కొన్నారు. బాధితులకు నిజంగా చేయాలనే ఉద్దేశం ఎవ్వరికీ కనిపించడం లేదన్నారు.తుపాను ప్రభావంతో నష్టపోయిన వారికి పూర్తి స్థాయి పరిహారం అందజేయాలని.. అప్పటివరకూ తమ పోరాటాన్ని విశ్రమించమని స్పష్టం చేశారు. -
తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్
-
తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్
విశాఖ : విశాఖలో హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోరోజూ పర్యటిస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తాటిచెట్లపాలెంలో పర్యటించిన బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.అలాగే ధర్మనగర్లో తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వైఎస్ఆర్ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.