సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ శుక్రవారమిక్కడ సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు అమలుపై చర్చిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం తర్వాత అమరావతిలోని పెట్టుబడి అవసరం లేని ప్రకృతి సాగు క్షేత్రాలను (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) రాజీవ్ కుమార్ పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment