కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: సంక్రాంతి పండగ అంటేనే పల్లెలు గుర్తుకొస్తాయి. ఉద్యోగం.. వ్యాపార రీత్యా నగరాలు, పట్టణాల్లో స్థిరపడిన వారంతా పండగ వేళ సొంతూరి గాలి పీల్చేందుకు ఇష్టపడతారు. ఎన్ని ము ఖ్యమైన పనులున్నా పక్కనపెట్టి ఊళ్లకు పయనమవుతారు. ఇలా వెళ్లాలనుకునే వారికి ఓ చేదువార్త. బస్సు ల మాట ఎలాగున్నా.. ఇప్పటికే రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ చేయించుకునేందుకు ఎంతో ఆశతో రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్న ప్రయాణికులకు నిరాశే మిగులుతోంది. వెయిటింగ్ లిస్టు సమాచారంతో వెనుదిరగాల్సి వస్తోం ది. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో పండగ సంబరం ఆవిరవుతోంది. ఉన్న వారు ఎలాగూ సొంత వాహనాలు.. లేదంటే ప్రత్యేక ట్యాక్సీల్లో బయలుదేరుతారు. ఎటొ చ్చి సామాన్య, మధ్య తరగతి కుటుం బాలు సొంతూళ్లకు చేరుకునేందుకు అష్టకష్టాలు పడక తప్పని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణికులకు ఇదే పరీక్షే. పెరిగిన బస్సు చార్జీలతో ఇప్పటికే ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గమైన రైలులో సీట్లు ఖాళీ లేకపోవడంతో తమ అవస్థలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బస్సు చార్జీతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ రైలులో 50 శాతం చార్జీతో వెళ్లి రావొ చ్చు. ప్యాసింజర్ రైలులో అయితే రూ.40లకే హైదరాబాద్ చేరుకోవచ్చు. కనీసం పండగ రోజుల్లోనైనా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఆ శాఖ చొరవ చూపని పరిస్థితి విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేక రైళ్ల విషయంలో రైల్వే శాఖ కర్నూలుపై చిన్నచూపు చూస్తోంది. రైల్వే శాఖ సహాయ మంత్రిగా జిల్లాకు చెందిన ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రాతి నిధ్యం వహిస్తున్నా ప్రత్యేక రైళ్లకు నోచుకోకపోవడం గమనార్హం. కర్నూ లు మీదుగా హైదరాబాద్‌కు యశ్వం త్‌పూర్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి తర్వాత అందుబాటులో ఉండగా.. గుంటూరు, కర్నూలు సిటీ, గుంతకల్లు ప్యాసింజర్ రైళ్లు ఉదయం వేళలో ఉన్నాయి.
కొంగు ఎక్స్‌ప్రెస్, వైనగంగ ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, ఓఖా ఎక్స్‌ప్రెస్, జైపూర్ ఎక్స్‌ప్రెస్, అమరావతి ఎక్స్‌ప్రెస్ వారంలో ఒకటి రెండుసార్లు మాత్రమే కర్నూలువాసులకు సేవలందిస్తున్నాయి. కర్నూలు నుంచే బయలుదేరే ఇంటర్‌సిటీ ఉదయం 06-05కి, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో దూర ప్రాంత రైళ్లలో నెల క్రితమే బెర్తులన్నీ రిజర్వేషన్‌లో భర్తీ అయిపోయాయి. ఇప్పటికీ వందలాది మంది రిజర్వేషన్ కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నా.. వెయిటింగ్ లిస్టుతో వెనుదిరగాల్సి వస్తోంది. సాధారణ కంపార్ట్‌మెంట్ల బోగీలు కేవలం రెండు మూడు మాత్రమే ఉండటం కూడా రద్దీకి కారణమవుతోంది. కూర్చోవడం సంగతి పక్కనపెడితే.. నిల్చునేందుకూ స్థలం ఉండకపోవచ్చని టీసీలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ సహాయ మంత్రి పండగకు కర్నూలు మీదుగా ప్రత్యేక రైళ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పెట్టెలన్నీ ఫుల్లు!
Published Wed, Dec 25 2013 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement
Advertisement