
రాష్ట్రపతి పాలనకు అవకాశంలేదు: దిగ్విజయ్ సింగ్
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశంలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను ముఖ్యమంత్రి పరిరక్షించాలని అన్నారు. తాము శాసనసభను తక్కువ చేయడంలేదని చెప్పారు. తెలంగాణ నోట్ శానసభకు వెళుతుందన్నారు.
సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చి, పరిస్థితి చేయి దాటిపోతున్న విషయం తెలసిందే. ఈ పరిస్థితులలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశంలేదని ఆయన స్సష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినప్పటికీ, తెలంగాణ నోట్ తప్పనిసరిగా శాసనసభకు వెళుతుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.