ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ హోరు నిరుద్యోగులకు ‘పరీక్ష’గా మారింది. రాష్ట్ర విభజన ప్రకటనతో ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలకు సీమాంధ్రలో పాలన అస్తవ్యస్తమైంది. ఉపాధ్యాయులు, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది కూడా విధులు బహిష్కరించి ఉద్యమంలో చేరారు. దీంతో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణ అసాధ్యంగా మారింది. సెప్టెంబర్ 1న నిర్వహించాల్సిన టెట్ రాష్ట్రం మొత్తం నిర్వహించటం అనుమానమనే సంకేతాలు అందటంతో ప్రభుత్వం వాయిదా వేసింది. జిల్లాలో టెట్‌కు సుమారు 20వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. సీమాంధ్రలో సమ్య్యై ఉద్యమం ఉధృతం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దీంతో పరీక్ష నిర్వహణ అంత తేలిక కాదని అధికారులు అంటున్నారు. రెండు మూడు రోజుల్లో సమైక్య ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. దీంతో టెట్ వాయిదా పడింది.
డీఎస్సీ అనుమానమే..
జిల్లాలో డీఎస్సీ-13 ద్వారా సుమారు 604 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు సన్నగిల్లాయి. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డీఎస్సీ-13 ప్రకటిం చటంతోపాటు, టెట్ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిందనే విమర్శలు గతంలో వినిపించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రావటంతో డీఎస్సీ-13 నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ఈ నోటిఫికేషన్ విడుదలకు ఆటంకంగా మారింది.
సమైక్య పోరుతో పరీక్షలకు బ్రేక్
Published Sat, Aug 24 2013 4:48 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement