అధికారం ఉన్నా.. లేకున్నా..జగన్ వెంటే నడుస్తా : మేకా | No matter what the occasion again it is .. not ..: Maka | Sakshi
Sakshi News home page

అధికారం ఉన్నా.. లేకున్నా..జగన్ వెంటే నడుస్తా : మేకా

Published Tue, May 20 2014 1:08 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

అధికారం ఉన్నా.. లేకున్నా..జగన్ వెంటే నడుస్తా : మేకా - Sakshi

అధికారం ఉన్నా.. లేకున్నా..జగన్ వెంటే నడుస్తా : మేకా

  •  జిల్లాలో జగన్ వెంట నడిచిన మొదటి వ్యక్తి నేనే
  •  నూజివీడుకు వైఎస్సార్ చేసిన అభివృద్ధి చరిత్రాత్మకం
  •  ఓటర్ల మనోభావాలు దెబ్బతీసే పని చేయను
  •  కొందరు చేసే దుష్ర్పచారాలు నమ్మొద్దు
  •  నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్
  •  నూజివీడు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినా, అవ్వకపోయినా ఆయన వెంటే నడుస్తానని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. మేకా ప్రతాప్ టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోందంటూ ఒక పత్రిక (సాక్షి కాదు)లో వచ్చిన కథనంపై స్పందిస్తూ సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ 2010లో జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాగానే జిల్లాలో ఆయన వెంట నడిచిన మొట్టమొదటి వ్యక్తి తానేనని గుర్తుచేశారు. అధికారం ఉందా, లేదా, భవిష్యత్‌లో అధికారంలోకి వస్తుందా, రాదా అని ఏనాడూ తాను ఆలోచించలేదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూజివీడు ప్రాంతానికి చేసిన అభివృద్ధి చరిత్రలో మిగిలిపోయిందని చెప్పారు.

    తాను ఏదడిగితే అది నూజివీడుకు చేశారని, అలాంటి వ్యక్తి కుటుంబాన్ని తాను వీడబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు, తనకు ఓటేసి గెలిపించిన ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే పనులు చేయనని తెలిపారు. తాను టీడీపీలోకి వెళ్తున్నానని కొందరు పనిగట్టుకుని చేసే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. తాను మాట తప్పే మనిషిని కాదని, తనది పార్టీలు మారి తప్పులు చేసే స్వభావం కాదని తెలిపారు.

    ‘ఇదే పార్టీలో ఉండి నియోజకవర్గంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులను గెలుచుకున్నాం.. ప్రజలు నాపై విశ్వాసం ఉంచి నేను నిలబెట్టిన వ్యక్తులను గెలిపించారు.. అలాంటి ప్రజలను నేను ఎట్టి పరిస్థితులలోను మోసం చేయను’ అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదన్నారు.
     
    రాబోయే రోజుల్లో అధికారం తథ్యం...

    రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీకి అధికారం తథ్యమని ప్రతాప్ అన్నారు. ఈ ఐదేళ్లూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. ప్రతిపక్ష పార్టీగా మెరుగైన సీట్లే వచ్చాయని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ బసవా భాస్కరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement