nujivedu
-
మీ బిడ్డ ఎవరికీ భయపడడు.. మీ బిడ్డకు మీరే సైనికులు అని ప్రజల సమక్షంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అసైన్డ్ భూములకు భూహక్కులు కల్పిస్తున్నాం
-
పేదవాళ్లకు వెన్నదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడంలేదు
-
నూజివీడులో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
ఆస్తి కోసం దారుణం! తాతను హతమార్చిన మనవడు..
నూజివీడు: ఆస్తి కోసం సొంత తాతయ్యనే మనవడు హత్య చేశాడు. ఆపై దానిని దుండగుల పనిగా చిత్రీకరించి విఫలయ్యాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి నూజివీడు డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని కోటవారిపేటకు చెందిన జూవ్వనపూడి గంగులు(70) అలియాస్ ఆదం ఈనెల 11వ తేదీ రాత్రి ఇంట్లోనే నిద్రిస్తూ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటనపై పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ కేసు నమోదు చేయగా, సీఐ ఎస్ ప్రసన్నవీరయ్యగౌడ్ మూడు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపారు. మృతుడికి నలుగురు కుమారులు కాగా, భార్య, రెండు, మూడో కుమారులు గతంలో మృతిచెందారు. ఆ తర్వాత ఆస్తి పంపకాల విషయమై వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మృతుడు గంగులు తన రెండు ఇళ్లను, పెద్ద కుమారుడైన శేఖర్‌కు రాస్తూ వీలునామా రాశాడు. దీంతో తన తాతపై మూడో కుమారుని కొడుకు, మనవడైన జువ్వనపూడి వరప్రసాద్(21) కక్ష పెంచుకున్నాడు. స్నేహితుని సాయంతో.. దీంతో వరప్రసాద్ తన స్నేహితుడైన నూజివీడు మండలం ఎంఎన్పాలెంకు చెందిన వనుకూరి ప్రేమకుమార్(23)తో కలిసి ఈనెల 11న అర్ధరాత్రి దాటిన తరువాత 2గంటల సమయంలో గంగులు తన ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా కరెంటు వైరుతో మెడకు చుట్టి గట్టిగా లాగి చంపారు. ఆ తర్వాత రూ.70వేల నగదు, నాలుగు బంగారు ఉంగరాలు, గొలుసు, ఆస్తికి సంబంధించి రాసిన వీలునామా తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత తనకు సహకరించినందుకు గాను తన స్నేహితుడికి రూ.30వేలు నగదు, రెండు ఉంగరాలను ఇచ్చాడు. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ పట్టణ, రూరల్, ముసునూరు ఎస్ఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు జరిపారు. సీన్ ఆఫ్ అఫెన్స్‌ని బట్టి కుటుంబ సభ్యులే ఈ ఘాతునికి పాల్పడి ఉంటారన్న అనుమానంతో విచారించిన పోలీసులు.. 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ ఎస్ ప్రసన్నవీరయ్యగౌడ్, ఎస్ఐలు తలారి రామకృష్ణ, ఎం. లక్ష్మణ్, కె. రాజారెడ్డి, అజయ్, సిబ్బందికి రివార్డులను అందజేశారు. చదవండి: అమ్మో! చెడ్డీ గ్యాంగ్!! స్కెచ్ వేశారో.. -
మామిడి తోటల పునరుద్ధరణకు రూ.20వేల ఆర్థికసాయం: కన్నబాబు
సాక్షి, అమరావతి: నూజివీడును ఉద్యానవన పంటల హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సోమవారం నూజివీడులో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.250 కోట్లతో జామ, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.2600 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ఒక హార్టీ కల్చర్ హబ్, ఆయిల్ ఫామ్ రైతులకు ఓఈఆర్ ధర చెల్లిస్తున్నామని చెప్పారు. టన్ను రూ.7 వేల నుంచి రూ.19 వేలు దాటేలా చర్యలు తీసుకున్నామని, మామిడి తోటల పునరుద్ధరణకు రూ.20వేల ఆర్థికసాయం అందించునున్నట్లు భరోసా ఇచ్చారు. చదవండి: బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం.. మార్గదర్శకాలివే -
ఐఐటికీ.. నూజివీడే అనుకూలం...
అందుబాటులో అనువైన స్థలం ప్రముఖుల రాకపోకలకు అనుకూలం నూజివీడు : సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఐటీని సొంత చేసుకుని గుర్తింపు తెచ్చుకున్న నూజివీడు ప్రాంతం నూతన నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్న ఐఐటీకీ అనుకూలమని ప్రముఖులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో 11జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పుతామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నూజివీడు ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నందున ఐఐటీ ఏర్పాటుకు నూజివీడు ప్రాంతం అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విభజన అనంతరం రాష్ట్రంలో నూతన రాజధాని ఏర్పాటు కోసం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నూజివీడులోనే ఐఐటీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ట్రిపుల్ఐటీ నిర్వహిస్తుండటంతో పాటు నూజివీడు ప్రాంతంలో వేలాది ఎకరాల అటవీభూములు, దేవాదాయ భూములు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ ఏర్పాటు చేయాలంటే కనీసం 3వందల ఎకరాల భూమి కావాలి. ఇంత భూమి జిల్లాలో నూజివీడు ప్రాంతంలోనే ఉండటంతో పాటు ఒక్కరైతును కూడా ఇబ్బంది పెట్టకుండా భూములను సేకరించడానికి ఇక్కడ అవకాశముంది. ఐఐటీ ఏర్పాటు చేసినట్లయితే నిత్యం దేశ వ్యాప్తంగానే కాకుండా, విదేశాల నుంచి సైతం ప్రపంచస్థాయి విద్యావేత్తలు, సైంటిస్టులు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. నూజివీడు నుంచి గన్నవరం విమానాశ్రయం కేవలం 30కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గతంలో 2007లో రాష్ట్రానికి ఐఐటీ మంజూరైనపుడు బాసరలో ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కేంద్రానికి నివేదిక పంపారు. దీంతో కేంద్రం నుంచి వచ్చిన హైపవర్ కమిటీ బాసర పరిసర ప్రాంతాలను సందర్శించి అక్కడి స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి విమానాశ్రయం లేదని, అదే హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తే ఐఐటీలకు వచ్చిపోయే విద్యావేత్తలకు, సైంటిస్టులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నివేదికను ఇవ్వడంతో చివరకు ఐఐటీని మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద 576ఎకరాల్లో నెలకొల్పారు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐఐటీని ఏర్పాటు చేయనున్నందున 30కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉండటం, 20కిలోమీటర్ల దూరంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి ఉండటం , విజయవాడ-గుంటూరు రాజధాని అయితే రాజధానికి కేవలం 40కిలోమీటర్ల దూరంలోరనే ఉండటం కూడా కలిసొచ్చే అంశమేనని ఈ ప్రాంత మేధావులు, రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి టెక్నాలజీని అనుసంధానం చేసుకోవడానికి ఐఐటీలు ఎంతో అవసరమైన నేపథ్యంలో నూజివీడులో ఐఐటీ ఏర్పాటు మంచిదేనే అభిప్రాయాన్ని సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. -
అధికారం ఉన్నా.. లేకున్నా..జగన్ వెంటే నడుస్తా : మేకా
జిల్లాలో జగన్ వెంట నడిచిన మొదటి వ్యక్తి నేనే నూజివీడుకు వైఎస్సార్ చేసిన అభివృద్ధి చరిత్రాత్మకం ఓటర్ల మనోభావాలు దెబ్బతీసే పని చేయను కొందరు చేసే దుష్ర్పచారాలు నమ్మొద్దు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ నూజివీడు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినా, అవ్వకపోయినా ఆయన వెంటే నడుస్తానని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. మేకా ప్రతాప్ టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోందంటూ ఒక పత్రిక (సాక్షి కాదు)లో వచ్చిన కథనంపై స్పందిస్తూ సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2010లో జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాగానే జిల్లాలో ఆయన వెంట నడిచిన మొట్టమొదటి వ్యక్తి తానేనని గుర్తుచేశారు. అధికారం ఉందా, లేదా, భవిష్యత్‌లో అధికారంలోకి వస్తుందా, రాదా అని ఏనాడూ తాను ఆలోచించలేదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూజివీడు ప్రాంతానికి చేసిన అభివృద్ధి చరిత్రలో మిగిలిపోయిందని చెప్పారు. తాను ఏదడిగితే అది నూజివీడుకు చేశారని, అలాంటి వ్యక్తి కుటుంబాన్ని తాను వీడబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు, తనకు ఓటేసి గెలిపించిన ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే పనులు చేయనని తెలిపారు. తాను టీడీపీలోకి వెళ్తున్నానని కొందరు పనిగట్టుకుని చేసే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. తాను మాట తప్పే మనిషిని కాదని, తనది పార్టీలు మారి తప్పులు చేసే స్వభావం కాదని తెలిపారు. ‘ఇదే పార్టీలో ఉండి నియోజకవర్గంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులను గెలుచుకున్నాం.. ప్రజలు నాపై విశ్వాసం ఉంచి నేను నిలబెట్టిన వ్యక్తులను గెలిపించారు.. అలాంటి ప్రజలను నేను ఎట్టి పరిస్థితులలోను మోసం చేయను’ అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదన్నారు. రాబోయే రోజుల్లో అధికారం తథ్యం... రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీకి అధికారం తథ్యమని ప్రతాప్ అన్నారు. ఈ ఐదేళ్లూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. ప్రతిపక్ష పార్టీగా మెరుగైన సీట్లే వచ్చాయని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ బసవా భాస్కరరావు పాల్గొన్నారు. -
కుప్పకూలిన టమోటా ధర
=రైతుకు దక్కేది కిలోకు మూడు రూపాయలే =ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి =కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన నూజివీడు, న్యూస్‌లైన్ : నెలరోజుల క్రితం వరకు కిలో రూ.30 వరకు పలికిన టమోటా ధర ఒక్కసారిగా కుప్పకూలడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు కిలోకు మూడు రూపాయలు కూడా దక్కడం లేదని, దీనివల్ల కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు బాగా ఉంటాయని అప్పులు చేసి మరీ సాగుచేస్తే దిగుబడి వచ్చే సమయానికి దారుణంగా పతనమవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పులు ఎలా తీరుతాయో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. నూజివీడు ప్రాంతంలో సిద్ధార్థనగర్, నర్సపేట, లైన్‌తండా, వెంకటాయపాలెం, హనుమంతులగూడెం, బత్తులవారిగూడెం, సుంకొల్లు, జంగంగూడెం, దేవరగుంట తదితర గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో టమోటా సాగు చేశారు. రోజుకు దాదాపు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ పరిస్థితుల్లో టమాటాకు ఈ ప్రాంతంలో మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు రైతుబజారులోని వ్యాపారులకు వేసినన్ని వేసి, మిగిలినవి కమీషన్ వ్యాపారులకు అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. మరికొంత ధర ఉంటే గుడివాడ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించి వస్తారు. ప్రస్తుతం ధర పడిపోవడంతో అక్కడి వరకు ఉపయోగం ఉండే అవకాశం లేక కమీషన్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. పంట సాగుచేసినందుకు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి అయిన నేపథ్యంలో ధర దిగజారడంతో పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం టమోటాకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే లాభసాటిగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు.