చర్చ అవసరమే లేదు | no need discussion | Sakshi
Sakshi News home page

చర్చ అవసరమే లేదు

Published Fri, Jan 10 2014 2:41 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

no need discussion

రాష్ట్ర విభజన అంశంపై రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిన తెలంగాణ బిల్లుపై చర్చ జరపాల్సిన అవసరమేలేదని పలువురు మేధావులు, విద్యావంతులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా అన్ని పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ విభజన వద్దని కోరుతుంటే దానిపై మళ్లీ చర్చ జరపడం అవివేకమంటున్నారు. చర్చకు అంగీకరించని పార్టీలు విభజనకు అనుకూలమని ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన ప్రకటనపై అన్ని వర్గాల వారు భగ్గుమంటున్నారు. ఈ అంశంపై వివిధ వర్గాల వారు ఏమన్నారంటే.  - న్యూస్‌లైన్, యూనివర్సిటీ క్యాంపస్
 
 వైఎస్సార్ సీపీ నిర్ణయం సహేతుకం
 వైఎస్సార్ సీపీ సమైక్యవాదానికి కట్టుబడి తీసుకున్న నిర్ణ యం సహేతుకమైంది. విభజన బిల్లుపై చర్చ జరిగితే త ప్పనిసరిగా విభజనను అంగీకరించినట్టే. ఎన్‌జీవో సం ఘం నేత అశోక్‌బాబు సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న రా జకీయ పార్టీలను  దెబ్బతీయడానికి చేసిన ప్రకటన తప్ప మరొకటికాదు. సీఎం సమైక్యవాదం వైపు నిలిచిఉంటే  విభజన బిల్లుపై సీడబ్ల్యుసీలో నిర్ణయం వెలువడిన రోజే రాజీనామా చేసి ఉండాలి. కాంగ్రెస్, టీడీపీ సమైక్యవాదం వైపు కానీ, విభజన వైపుకానీ స్పష్టమైన విధానం ప్రకటిం చలేదు. వైఎస్‌ఆర్ సీపీ మాత్రమే సమైక్యవాదానికి కట్టుబడి ఉంది.   - భూమన్, శ్వేత మాజీ సంచాలకుడు
 
 చర్చ అనవసరం
 రాష్ట్రంలోని ఆరుకోట్ల మంది ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నారు. అలాగే తెలంగాణ ప్రాంతంలోని సామాన్య ప్రజలు కూ డా రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని కోరుకుంటుంటే కొందరు రాజ కీయ నాయకులు మాత్రమే ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు. అలాంటప్పుడు రాష్ట్ర విభజన అంశంపై ప్రవేశ పెడుతున్న బిల్లుపైన చర్చ జరపడం అనవసరం.
  - స్టాన్లీ జయకుమార్, ప్రొఫెసర్, ఎస్వీయూ
 
 సమైక్యవాదమే అందరి నినాదం
 రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు రాష్ట్ర విభజన అంశంపై చర్చ జరపడం అనవసరం. ఎన్‌జీవో నాయకులు రాష్ట్ర విభజన అంశంపై చర్చ జరపాలని పట్టుబట్ట డం కొన్ని రాజకీయ పార్టీలకు మేలు చేయడం కోసమే. - మహ్మద్‌షఫీ, నాన్‌టీచింగ్ ఉద్యోగి, ఎస్వీయూ
 
 అశోక్‌బాబు సీఎం తొత్తు
 ఎన్‌జీవో సంఘనేత అశోక్‌బాబు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. సీఎం చేతిలో కీ లుబొమ్మలా మాట్లాడుతున్నారు. రా ష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల వారు తీ వ్రంగా ఉద్యమం చేస్తున్న సందర్భంలో సీఎం  మాయమాటలు తలొగ్గి  ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. - ఎం.శివాన ందరెడ్డి, ఎస్వీయూ

 మహానటులు మన మంత్రులు
 సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర మం త్రులు సమైక్యం కోసం పనిచేస్తున్న ట్లు గొప్పగా నటిస్తున్నారు. సినిమా వారికంటే గొప్పనటులుగా నిరూపించుకుంటున్నారు. వీరందరూ రాష్ట్ర సంక్షేమం, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడంలేదు. సీఎం పైకి సమైక్యవాదిగా నటిస్తూ   విభజనకు సహకరిస్తున్నారు. ఈయనకు అశోక్‌బాబు వంత పాడుతున్నారు.
 - సింగం ప్రభాకర్, నాన్‌టీచింగ్ ఉద్యోగి, ఎస్వీయూ
 
 సమైక్య తీర్మానం చేయాలి
 సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర మం త్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు  రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి ఉంటే సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్య తీర్మానం చేయాలి. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా సమైక్యం కోసం తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలి. అలా చేస్తేనే విభజన ప్రక్రియ ఆగుతుంది.  - ఎం.ప్రహ్లాదరెడ్డి, తిరుపతి
 
 విభజనకు ఒప్పుకున్నట్లే
 రాష్ట్ర విభజన అంశంపై చర్చ నిర్వహిస్తే అందరూ రాష్ట్ర విభజనకు సు ముఖంగా ఉన్నట్లే అవుతుంది. రాష్ట్ర విభజన ఏ ఒక్కరూ ఒప్పుకోనప్పుడు దానిపై చర్చ జరపాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒకవేళ తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉందని భావిస్తే దాని అభివృద్ధికి ఏం చేయాలన్న అంశాన్ని చ ర్చిస్తే సరిపోతుంది. - ఎస్వీ. సుబ్బారెడ్డి, ప్రొఫెసర్

 లోతైన అధ్యయనం జరగాలి
 రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరూ విభజన కో రుకోవడం లేదు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు రాజ కీయ నిరుద్యోగులు ప్రత్యేక వాదంతో ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర విభజన ప్రయత్నం చేయకుండా అసలు విభజన అవసరం ఎందుకు అన్న అంశంపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. అశోక్‌బాబు ప్రకటన సమైక్యానికి కట్టుబడి ఉన్న పార్టీలను దెబ్బతీసేదిగా ఉంది. - ఎంసీ.ఓబులేశు, ఎస్వీయూ

  విభజన వల్ల అందరికీ నష్టం
 రాష్ట్ర విభజన వల్ల అన్ని వర్గాల వారికీ నష్టం వాటిల్లుతుంది. ఏ ఒక్కరూ విభజన కోరుకోవడం లేదు. విభజన జరిగితే నష్టపోతామని అన్ని వర్గాలు తీవ్రంగా విశ్వసిస్తున్నాయి. తెలుగువారందరూ ఎప్పటికీ కలసి ఉండాలి. అందరి నినాదం సమైక్యమే. విభజనతో నష్టపోతాం. - సయ్యద్ మున్నీరు మహ్మద్‌ఖాద్రి, తిరుపతి
 
 ఏకగ్రీవ తీర్మానం చేయాలి
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని   రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీ ర్మానం చేయాలి. రాష్ట్ర విభజనకు  కేం ద్ర ప్రభుత్వం కుట్రపన్నింది. అలాం టి కుట్రను కాంగ్రెస్ పార్టీ మంత్రు లు, సీఎం అమలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అంశంపై చర్చ జరపడం అనవసరం. కాంగ్రెస్, టీడీపీ కలసి రాష్ట్ర విభజన కుట్ర అమలు చేస్తున్నాయి. - పేట శ్రీనివాసులురెడ్డి, మీడియా డీన్, ఎస్వీయూ
 అశోక్‌బాబు సమైక్యద్రోహి
 ఎన్‌జీవో నాయకుడు అశోక్‌బాబు ముఖ్యమంత్రి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. పైకి సమైక్యవాదిగా నటిస్తూ సమైక్యద్రోహం చేస్తున్నారు. ఆయన చేసిన ప్రకటన పరిశీలిస్తే సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలను దెబ్బతీసి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మేలు చేసేలా ఉంది. ఈ విషయాన్ని సీమాంధ్ర ప్రజలంతా గమ నిస్తున్నారు.- వి.హ రిప్రసాద్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ కన్వీనర్
 
 నాటకాలు ఆడుతున్నారు
 రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు కలిసే నాటకాలు ఆడుతున్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ ఎందుకు? సీఎం ప్రజల్ని మభ్యపెట్టకుండా సభలో సమైక్య తీర్మానం చేసేలా చూడాలి.  - వి.రెడ్డిశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, చిత్తూరు
 
 బిల్లుపై చర్చ అనవసరం
 విభజన విషయంలో అసెంబ్లీ తీర్మానంతో పనిలేనప్పుడు, బిల్లుపై చర్చ ఎందుకు జరపాలి? ప్రజలు ఇప్పటికే ఈ విషయంలో విసిగిపోయూరు. అ సెంబ్లీలో చర్చ జరిగే సమయంలో ఎమ్మెల్యేలు తిట్టుకోవడం, అడ్డుకోవ డం చేస్తున్నారు. అలాకాకుండా సమైక్య తీర్మానం చేయా లి. లేదా ఓటింగ్ పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.  - ఏఎం గిరిప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, చిత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement