హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి చర్చకు వచ్చిన వెంటనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షులు అశోక్‌బాబు తెలిపారు. ఆదివారం ఇక్కడ ఏపీఎన్జీవోల కార్యాలయంలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ.. ఏపీఎన్జీవోలను కట్టడి చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయని, తమను అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదన్నా రు. తమ సంఘంపై జరుగుతున్న దాడిని సమైక్యవాదులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తమకు రాష్ట్ర సమైక్యత, ఉద్యోగుల సమస్యలు రెండు కళ్లలాంటివని, వాటిపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టేందుకు అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని, బిల్లు ప్రవేశపెట్టడంపై స్పష్టత వచ్చిన తరువాతే ఆందోళన కార్యక్రమాల వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇక తమ సంఘం ఎన్నికలకు కోర్టు ఉత్తర్వుల ప్రకారమే షెడ్యూల్ విడుదల చేశామన్నారు. ఎన్నికలు యథాతథంగా జరుగుతాయని చెప్పారు. కాగా పలు జిల్లాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.
పదవి కోసం పాకులాడుతున్న అశోక్‌బాబు
ఏపీఎన్జీవో నేత రవీంద్రబాబు ధ్వజం
నెల్లూరు, న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమం పేరుతో పైరవీలు సాగించి, ఉద్యమాన్ని అర్ధాంతరంగా గాలికొదిలిన ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు మళ్లీ ఆ పదవి కోసం పాకులాడుతున్నారని సంఘం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ సి.రవీంద్రబాబు విమర్శిం చారు. నెల్లూరులో ఆదివారం జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన సమస్యలను పట్టించుకోకుండా దొడ్డిదారిన తిరిగి మళ్లీ అధ్యక్ష పదవి కోసం అశోక్‌బాబు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల మనోభావాలను గ్రహించలేని అజ్ఞాని, అహంకారిగా చరిత్రలో నిలచిపోతాడని హెచ్చరించారు.అధ్యక్షుడిగా అశోక్‌బాబు పనికిరాడన్నారు.
బిల్లు పెట్టిన వెంటనే కార్యాచరణ: అశోక్‌బాబు
Published Mon, Dec 16 2013 12:29 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement