చెట్టును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు | No one injured in RTC bus rams tree | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

Published Tue, May 5 2015 10:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

No one injured in RTC bus rams tree

ఒంగోలు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తోపాటు 33 మంది  ప్రయాణికులకు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బస్సు ముందు భాగం ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అలాగే ఇదే మండలంలోని ఏల్చూరు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ఆటో ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement