అనంతపురంలో ఈనెల 17న ప్రకాశ్ కారత్ పర్యటన, పోలీసుల అత్యుత్సాహంతో కార్యకర్తలపై బైండోవర్ కేసులు.
అనంత పురం పోలీసుల తీరుపై సీపీఎం కార్యకర్తలు మండి పడుతున్నారు. ఈనెల 17న ఆ పార్టీ జాతీయ నేత ప్రకాశ్ కారత్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్ పీ కుంట సోలార్ బాధితులను పరామర్శించేందుకు వస్తున్న ప్రకాశ్ కారత్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు.. పలువురు పార్టీ నేతలను, కార్యకర్తలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పై కూడా బైండోవర్ నమోదు చేయడంతో పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరుపై మండి పడుతున్నాయి.