' సీమాంధ్రుల రక్షణకు ఎటువంటి ఢోకా ఉండదు' | no problem for seemandhra people stay in hyderabad, says kodandaram | Sakshi
Sakshi News home page

' సీమాంధ్రుల రక్షణకు ఎటువంటి ఢోకా ఉండదు'

Published Mon, Aug 12 2013 4:27 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

' సీమాంధ్రుల రక్షణకు ఎటువంటి ఢోకా ఉండదు' - Sakshi

' సీమాంధ్రుల రక్షణకు ఎటువంటి ఢోకా ఉండదు'

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఆచార్య కోదండరామ్  తెలిపారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో హైదరాబాద్‌పై తాము రాజీపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణకు ఎటువంటి ఢోకా ఉండదని కోదండరామ్ భరోసా ఇచ్చారు.

 

అక్కడ ప్రజలను సీమాంధ్ర నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌తో సహా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే తమ డిమాండ్ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement