అంకెల సాగు | no speciality in agri budget | Sakshi
Sakshi News home page

అంకెల సాగు

Published Sat, Mar 14 2015 1:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

no speciality in agri budget

హైదరాబాద్: 'వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ గొప్పగా చెప్పిన సర్కారు ఆ ప్రత్యేకతే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. అంకెల సాగే తప్ప సాగుకు కావాల్సిన నిధులే ఇవ్వలేదు. రైతు ఆత్మహత్యలపై దృష్టి పెట్టలేదు. ఎన్నికల్లో గొప్పగా చెప్పుకొన్న రుణమాఫీని ప్రస్తావనకే పరిమితం చేసి తన చిత్తశుద్ధి బయటపెట్టుకొంది'.

వ్యవసాయ రంగ సంక్షోభాన్ని అధిగమించి నూతనోధ్యాయాన్ని ఆవిష్కరించడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.14,184.03 కోట్లతో రూపొందించిన వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్‌ను ఆయన శుక్రవారం రాష్ట్ర శాసనసభకు సమర్పించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఆగస్టులో వ్యవసాయానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రత్తిపాటి ఈసారి తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. మొత్తం బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం (రూ.4,513.45 కోట్లు) కంటే ప్రణాళికేతర వ్యయమే (రూ.9,670.58 కోట్లు) ఎక్కువగా ఉంది. 28 పేజీల బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని.. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12.14 గంటలకు మంత్రి చదవడం ప్రారంభించారు.

 

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సైతం వ్యవసాయ రంగం 5.9 శాతం అభివృద్ధిని నమోదు చేసిందన్నారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఉపయోగపడిన రుణమాఫీకి ఇప్పటిదాకా జరిగిన కసరత్తును ప్రసంగంలో ఏకరువు పెట్టారే తప్ప.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత ఇవ్వబోతున్నదీ చెప్పలేదు. సహకార, ప్రాథమిక వ్యవసాయ సంఘాల కంప్యూటరీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో రూ.7.88 కోట్లతో ప్రయోగాత్మకంగా ఐసీడీపీ పథకాన్ని, అనంతపురం జిల్లా దాదులూరు గ్రామంలో రూ.8 కోట్లతో గవార్‌గమ్ (గోరుచిక్కుడు) శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. కరువు పీడిత ప్రాంతాల్లో పశువుల కోసం వసతి గృహాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 2015-16లో 21.62 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి తెలిపారు. విజయవాడను ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా చేయాలని యోచిస్తున్నామన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల పనులను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవచ్చునన్నారు. వ్యవసాయ రంగానికి ఉచితంగా ఏడు గంటల విద్యుత్‌ను ఇస్తామని చెప్పారు. వ్యవసాయం కన్నా దాని అనుబంధ రంగాలను బలోపేతం చేయడంతోనే రైతుకు లాభాలు వస్తాయని అన్నారు. వ్యవసాయ యంత్రీకరణే లక్ష్యమన్న మంత్రి... అందుకు ఉపయోగించే యంత్రాలన్నింటిలోనూ ప్రైవేటు భాగస్వాములకు ఆహ్వానం పలికారు. ఇలావుండగా శాసనమండలిలో కార్మికమంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను చదివారు.
 
 కేటాయింపు ప్రతిపాదనలు ఇలా... (రూ.కోట్లలో)
 
 రైతుల ఉచిత విద్యుత్‌కు                                3,000
 రుణమాఫీకి                                                 4,300
 (మంత్రి తన ప్రసంగంలో చెప్పలేదు..)
 జాతీయ ఉపాధి హామీ                             2,717.61
 హై వోల్టేజీ పంపిణీ విధాన పథకం                 294.75
 (ఇందులో జైకా రుణం 251.58 కోట్లు)
 జన్యుమార్పిడి పంటలపై ల్యాబ్స్‌కు                13.89
 గోరుచిక్కుడు శుద్ధి కర్మాగారానికి                        3
 పావలా వడ్డీ                                                    10
 వడ్డీలేని రుణాలు                                            172
 వ్యవసాయ యంత్రీకరణ                            141.63
 ఉపగ్రహ వ్యవస్థతో పంటల నియంత్రణ                     3
 పంటల మార్పిడి కోసం(విత్తనాలు)                     80
 యంత్రాలపై ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీలకు        141.63
 వ్యవసాయ విస్తరణకు                                   81.21
 చంద్రన్న రైతు క్షేత్రం, పొలం పిలుస్తోంది                10
 వ్యవసాయ మౌలికసదుపాయాలకు           20
 కరువు నివారణ చర్యలకు                        30
 పొలంబడి కార్యక్రమం                            1.46
 మార్క్‌ఫెడ్‌కు    60
 జాతీయ వ్యవసాయ మిషన్‌కు                513.21
 వ్యవసాయ విశ్వవిద్యాలయానికి               367.73
 ఉద్యానవన శాఖకు                                210
 సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌కు            100
 బిందు, తుంపర సేద్యానికి                    144.07
 కూరగాయల స్టోరేజీకి                             58.25
 పామాయిల్ తోటల పెంపకానికి                 28.90
 పట్టు పరిశ్రమ విభాగానికి                         93.61
 వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి          53.01
 పశుసంవర్ధక శాఖకు                           672.73
 పశు వైద్యశాలల ఆధునీకరణకు                     50
 పశు వసతి గృహాలకు                                   5
 మత్స్యశాఖకు                                        223
 పశువైద్య విశ్వవిద్యాలయానికి                  124.48
 కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రాలకు                   10.20
 పశుగ్రాసం అభివృద్ధికి                              41.40
 గిడ్డంగుల అభివృద్ధి, నిర్మాణం                      56
 రుణమాఫీ
 మొత్తం ఖాతాలు                                80.66 లక్షలు
 తొలిదశలో ఉపశమనం                         40.50 లక్షలు
 (కుటుంబాలైతే 23.22లక్షలు)
 ఇప్పటివరకు జమ అయిన మొత్తం       రూ.4,689 కోట్లు
 రెండో దశలో ఖాతాలు                            42.16 లక్షలు
 (కసరత్తు కొలిక్కి రాలేదు, డబ్బు జమ కాలేదు)
 ఉద్యాన వన పంట రైతులకు (ఎకరానికి)    రూ.10 వేలు
 
 రైతుబంధు పథకం కింద రుణాలు
 (2014-15లో ఇచ్చినవి)                          17.83
 ప్రకాశంలో ఐసీడీపీ పథకం                           7.88
 ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు
 రూ.5 లక్షల పరిహారం
 ఇందులో బాధిత కుటుంబానికి                     రూ.3.5 లక్షలు
 అప్పిచ్చిన వ్యక్తికి                                         రూ.1.5 లక్షలు
 వర్షపాతం, పంటలు..
 సగటు వర్ష పాతం లోటు                                36 శాతం
 ఖరీఫ్‌లో పంటలు వేసిన విస్తీర్ణం                      39.80 లక్షల     హెక్టార్లు
 దిగుబడుల అంచనా    111.43 లక్షల         టన్నులు
 (2013తో పోల్చితే 4.7 శాతం తక్కువ)
 కరువు ప్రాంతాలు..
 రాష్ట్రంలో మొత్తం మండలాలు (కొత్తవి కలిపి)    670
 కరవు పీడిత జిల్లాలు                                     7
 కరువు మండలాలు                                     238
 సాయం అందించిన మండలాలు    లేవు
 కారణం    ఇంకా నివేదికల స్థాయిలోనే
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement