నేను రాజీనామా చేస్తే విలీనం చేస్తారా?:విజయశాంతి
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుపై ఇటీవల కాంగ్రెస్లో చేరిన మెదక్ ఎంపి విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మాటకు కట్టుబడని కెసిఆర్ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పింది ఆయనే, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నది ఆయనే, ఇప్పుడు మాట తప్పుతున్నది ఆయనే అన్నారు. విలీనంపై కుంటిసాకులు చెబుతున్నారన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినందువల్లే టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయలేదని చెబుదున్నారని, తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తాను రాజీనామా చేస్తే పార్టీని విలీనం చేస్తారా? ప్రశ్నించారు.
పార్లమెంటులో బిల్లు పాసైన తరువాతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తెలంగాణ ఇస్తే తాను తప్పక కాంగ్రెస్ పార్టీలో చేరతానని సోనియా గాంధీకి చెప్పానని, ఆ మాట ప్రకారం చేరానని చెప్పారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిన తరువాత ఆ పార్టీ ఎంపిలను టిఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలు సోనియా గాంధీ అని, ఆమెకు చెందిన మనుషులపై పోటీకి పెట్టి ఓడిస్తారా? అని అడిగారు. తల్లికి వెన్నుపోడుస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు నిజాయితీపరులు, వారు తప్పక కాంగ్రెస్ను గెలిపిస్తారని చెప్పారు.
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా? అని ఓ విలేకరి కెసిఆర్ను ప్రశ్నిస్తే ఆయన విసుక్కుంటూ మాట్లాడారని విమర్శించారు. దళితులంటే అంత చులకనా? మాటకు మీరు కట్టుపడరా? అని ప్రశ్నింనేను రాజీనామా చేస్తే విలీనం చేస్తారా?:విజయశాంతిచారు. దళితులు, బడుగు బలహీన వర్గాలవారు ఎదగకూడదా? అని అడిగారు. దొరల పాలన అన్నదే వారి ధోరణి అని విమర్శించారు.
తమ డిమాండ్లు అంగీకరించలేదని చెబుతున్నారు. అలా అనుకున్నప్పుడు అప్పుడే వ్యతిరేకత తెలియజేసి ఉండవచ్చు గదా అన్నారు. అప్పుడు విజయోత్సవాలు చేసుకొని, ఇప్పుడు ఇలా మాట్లాడతారా? అని అడిగారు. డిమాండ్లంటే అవి తెలంగాణకు సంబంధించిన డిమాండ్లా? పర్సనల్ డిమాండ్లా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో తానూ ఉన్నానని, అక్కడ ఏం జరిగిందో తనకు తెలుసునని చెప్పారు.
కాంగ్రెస్కు గెలిచే అవకాశాలు లేవని చెబుతున్నారు. గత ఎన్నికలలో మీరు అందరూ మహాకూటమిగా ఏర్పడినా కాంగ్రెస్ ఎవరితోనూ పొత్తపెట్టుకోకుండా ఒంటరిగానే గెలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ తప్పక గెలుస్తుందని చెప్పారు. దళితుడు ముఖ్యమంత్రి కావాలని, మంచి ముఖ్యమంత్రి రావాలన్నది తన కోరిక అని విజయశాంతి అన్నారు.