
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో మంగళవారం ఉదయం భక‍్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర‍్వదర‍్శనానికి, కాలినడకన వచ‍్చే భక‍్తులకు, ప్రత‍్యేక దర‍్శనానికి ఒక గంట సమయం పడుతోంది.
సోమవారం శ్రీవేంకటేశ‍్వరస‍్వామిని 60,507 మంది భక‍్తులు దర్శించుకున్నారు. 22,384 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి ఆదాయం రూ.3.20 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.