నోట్ల కట్టలు | Notes coats | Sakshi
Sakshi News home page

నోట్ల కట్టలు

Published Fri, Jan 24 2014 2:40 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

నోట్ల కట్టలు - Sakshi

నోట్ల కట్టలు

  •      మేడారంలో మైనర్ ఇరిగేషన్ లీలలు
  •      మూడింతలు మించి అంచనాలు
  •      రూ.20 లక్షలు దాటని ఖర్చుకు రూ. 60 లక్షల కేటాయింపు
  •      కాంట్రాక్టర్ కొమ్ముకాస్తున్న పాలకులు
  •      కాసుల కక్కుర్తిలో అధికారులు
  •      కట్టల నిర్మాణం, ఇసుక లెవలింగ్‌లో నిర్వాకం
  •      జంపన్నవాగులో కలిసిన పొన్నాల హామీలు
  •  
    మేడారం, న్యూస్‌లైన్ : మేడారం మహాజాతర నేపథ్యంలో చేపట్టిన పనులు పలువురికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ ధనదాహం... వారికి కొమ్ముకాస్తున్న పాలకులు... అధికారుల కాసుల కక్కుర్తి వెరసి ప్రజాధనం వృథా అవుతోంది. చారాణా ఖర్చుకు బారానా మసాల అన్నట్లు మైనర్ ఇరిగేషన్ శాఖ మూడింతలకు మించి అంచనాలు రూపొందించిన తీరు.. ఆ శాఖను అభాసుపాలు చేస్తోంది.

    వచ్చే నెల 12వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు జరిగే మేడారం మహాజాతరను పురస్కరించుకుని జంపన్నవాగులో భక్తుల సౌకర్యార్థం ఇసుక క ట్టల నిర్మాణం.. ఇసుక లెవలింగ్ పనులను చిన్న తరహా నీటిపారుదల శాఖ మొదలుపెట్టింది.  పనులు చేయడానికి కనిష్టంగా *15లక్షలు, గరిష్టం గా రూ. 20 లక్షల ఖర్చు మాత్రమే అవుతుంది. కానీ... ఈ పనులకు ఆ శాఖ రూ.60 లక్షలు కేటాయించింది. మిగతా సొమ్మును కాజేసేందుకు కాంట్రాక్టర్‌తో పలువురు అధికారులు కుమ్మక్కై ఈ యవ్వారానికి శ్రీకారం చుట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
     
    లెక్కకు మించి అంచనాలు

     జంపన్నవాగుపై బాతింగ్ ఘాట్స్, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, వివిధ సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం *20.65 కోట్లు కేటాయించింది.  వీటిలో సగం నిధులకు సంబంధించిన పనులకు మాత్రమే ప్రస్తుతం అనుమతి రాగా... పురోగతిలో ఉన్నాయి. అయితే... అన్ని పనుల్లోనూ లెక్కకుమించి అంచనాలు రూపొందించారనే ఆరోపణలు మొదటి నుంచీ వస్తున్నాయి. వాగులో మొత్తంగా 12 ఇసుక క్రాస్‌బండ్స్ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఒక్కో క్రాస్ బండ్ నిర్మాణానికి సుమారు 2,500 గన్నీ సంచులు పడుతాయని అధికారులు చెబుతున్నారు. వాగులోనే ఇసుక లభ్యమవుతున్నా.. బయటి నుంచి  తెప్పించాలన్న నిబంధనతో ఎక్కువ మొత్తం అంచనాలు రూపొందించినట్లు వారు  సెలవిస్తున్నారు. కానీ.. ఈ సంచుల్లో వాగులోని ఇసుకను అక్కడికక్కడే నింపుతున్నారు. అన్ని ఓ మోస్తరు పాత సంచులు, నాసిరకంవే వాడుతున్నారు.

    పెద్దసంఖ్యలో కొనుగోలు చేస్తున్నందున ఒక్కో గన్నీ సంచికి రూ.20 నుంచి రూ.25 వరకు ధర ఉంటుందని వ్యాపారులు తెలిపారు. కూలీలకు ఒక్కో సంచి నింపినందుకు గంపగుత్తాగా రూ.12 చొప్పున చెల్లిస్తున్నారు. . ఈ లెక్కన ఒక్కో క్రాస్‌బండ్ నిర్మాణానికి రూ. లక్షకు లోపు మాత్రమే ఖర్చు అవుతోంది. అంటే 12 అడ్డుకట్టలకు రూ.12 లక్షల వరకు ఖర్చువుతున్నట్లు అంచనా. మరీ ఎక్కువ అనుకున్నా మరో రూ. రెండు, మూడు ల క్షలు ఎక్కువ అంచనా వేయాల్సింది పోయి.... ఏకంగా రూ.30 లక్షల అంచనాలు రూపొందించడం అనుమానాలకు తావిస్తోంది.
     
    గోతులు పూడ్చడంలోనూ..
     
    జంపన్నవాగులో చేపడుతున్న వివిధ పనుల కారణంగా ఏర్పడ్డ గోతుల ను పూడ్చేందుకుగాను ఇసుక లెవలింగ్‌కు సుమారు *30 లక్షలను వెచ్చించినట్లు మైనర్ ఇరిగేషన్ డీఈ తెలిపారు. ఈ లెవలింగ్ పనులు ప్రతీ జాతర సందర్భంగానూ నామమాత్రంగానే జరుగుతున్నాయి. దీంతో పలువురు జాతర సందర్భంగా మృతిచెందిన ఆనవాళ్లున్నాయి. అయితే ఈ లెవలింగ్ పనులను సక్రమంగా చేపడితే రూ.6 లక్షల నుంచి 7 లక్షల ఖర్చు అవుతుందని.. తూతూమంత్రంగా చేపడితే ఈ మాత్రం కూడా కాదని కాంట్రాక్టర్ వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన చూసుకున్నా.. ఈ పనుల్లోనూ ఇష్టారీతి వ్యవహారంతో * 30 లక్షల అంచనాలు రూపొందించినట్లు స్పష్టమవుతోంది.. ఇలా జంపన్నవాగులో తొక్కుతున్న అవినీతి పరవళ్లపై పాలకులు నోరుమెదపడంలేదు. పెపైచ్చు వాగు వద్ద చేపట్టే * 9.60 కోట్ల పనులను ఒకే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి తమ సహకారం అందిపుచ్చుకుంటున్నట్లు వినికిడి.
     
    పొన్నాల మాటలు.. నీటి మూటలు
     
    ‘మేడారం జాతర సందర్భంగా తాత్కాలికంగా వాగులో ఇసుక సంచులతో అడ్డుకట్టలు వేయడం జరుగుతోంది. ఆ తదుపరి వాటితో పనిలేకపోవడంతో నిధులు నిరుపయోగమవుతున్నాయి. అందుకుగాను వచ్చే జాతర నాటికి చెక్‌డ్యాం చేపడతాం. తద్వారా రైతులకు మేలు జరగడంతోపాటు శాశ్వత ప్రాతిపదికన పనులు జరిపించినట్లవుతుంది.’ గత జాతర సందర్భంగా పనుల పరిశీలన నిమిత్తం మేడారానికి వచ్చిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్న మాటలివి. ఈ హామీ నీటిమూటలుగా మిగలగా... తాజాగా ప్రజాధనం దుర్వినియోగం కావడం పాలకుల పట్టింపులేమికి నిదర్శనమని చెప్పవచ్చు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement