తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్ : చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలను ఆదరించి తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో ని త్యాగరాజమండపంలో ఏర్పాటు చేసిన ‘చేనేత తోరణాల వస్త్ర ప్రదర్శన’ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్ర తయారీ కేవలం భారతదేశంలోనే ఉందన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మారుతున్న కాలాని కి అనుగుణంగా చేనేత వస్త్రాలను త యారు చేసి ప్రజలకు అందిస్తున్నారన్నారు.
ప్రభుత్వ పరంగా అనేక పథకాలు అందిస్తున్నా వీరికి మరింత ప్రోత్సాహక పథకాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజ లందరూ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. చేనేత జౌళి శాఖ సంచాల కుడు పి.జయరామయ్య మాట్లాడు తూ కార్మికులు తయారు చేసిన వ స్త్రాలను సొసైటీల ద్వారా ప్రదర్శన లు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగి స్తున్నామన్నారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న సమైక్యాంధ్ర ఉద్య మ నేపథ్యంలో వస్త్ర ప్రదర్శనలకు విరామం వచ్చిందన్నారు.
నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని 23 జిల్లాలకు చెందిన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రదర్శన లో ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్ర దర్శన 11వ తేదీ వరకు రోజూ ఉ దయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందన్నారు. ఇందులో అన్ని రకాల చేనేత వస్త్రాలు సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. అప్కో డెరైక్టర్ మిద్దెలహరి, చేనేత కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షుడు కుప్పయ్య పాల్గొన్నారు.
ఏజేసీకి వినతి
చేనేత తోరణాల వస్త్ర ప్రదర్శన ప్రారంభానికి విచ్చేసిన జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డికి చేనేత కార్మికుల సమస్య లు పరిష్కరించాలని కోరుతూ చేనే త కార్మిక యూనియన్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 45 వేల కుటుంబాలు చేనేత వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నాయ ని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు కల్పించి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశా రు. వినతి పత్రం సమర్పించిన వారి లో కేవీ.కుప్పయ్యశెట్టి, ఆకులవాసు ఉన్నారు.
చేనేత వస్త్రాలను ఆదరించండి
Published Fri, Jan 3 2014 5:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement