13న ఎమ్మెస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ | NTR health university MSC nursing councelling on october 13 | Sakshi
Sakshi News home page

13న ఎమ్మెస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్

Published Wed, Sep 30 2015 7:44 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

NTR health university MSC nursing councelling on october 13

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : ఎమ్మెస్సీ (నర్సింగ్) కోర్సులో అడ్మిషన్ల కోసం ఈ నెల 13న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఆగస్టు 16న నిర్వహించిన ఎమ్మెస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని సూచించారు. ఈ మేరకు యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.2 వేలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1500 చొప్పున చెల్లించి కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు. కళాశాలలు, సీట్ల వివరాలు కౌన్సెలింగ్‌కు ఒకరోజు ముందు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పెడతామని తెలిపారు. మరిన్ని వివరాలు ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌(Http://ntruhs.ap.nic.in) లో పొందవచ్చునని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement