MSC
-
25 ఏళ్లుగా ఎంట్రన్స్‌లో ఫెయిల్.. 55వ ఏట ఎంఎస్‌స్సీ పట్టా!
‘కష్టపడి పనిచేసేవారు ఎప్పటికీ ఓడిపోరు.. ఓర్పుతో ప్రయత్నాలు సాగిస్తుంటే విజయం సాధిస్తారని జబల్పూర్(మధ్యప్రదేశ్)కు చెందిన రాజ్‌కరణ్ బారువా నిరూపించారు. 55 ఏళ్ల రాజ్‌కరణ్ బారువా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే 25 ఏళ్లుగా ఫెయిల్ అవుతున్నప్పటికీ పట్టువీడని రాజ్‌కరణ్ ఎట్టకేలకు ఎంఎస్సీ గణితశాస్త్రంలో పట్టా సాధించాడు. ఈ విజయాన్ని సాధించడానికి రాజ్‌కరణ్ తన సంపాదనలో అత్యధిక భాగాన్ని వెచ్చించాడు. రాజ్‌కరణ్ తొలుత ఆర్కియాలజీలో ఎంఏ ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంగీతంలో డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత పాఠశాలలో సంగీతం బోధిస్తుండగా, తోటి ఉపాధ్యాయుడు గణితం బోధించే తీరును చూసి ముగ్ధుడయ్యాడు. దీంతో రాజ్‌కరణ్‌కు గణితంలో ఎంఎస్సీ చేయాలనే ఆలోచన వచ్చింది. 1996లో గణిత సబ్జెక్టుతో ఎంఎస్సీ చేయడానికి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం (జబల్పూర్)లో అడ్మిషన్ తీసుకున్నాడు. 1997లో తొలిసారిగా ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షకు హాజరైనా ఫెయిల్ అయ్యాడు. ఇలా ప్రతీ ఏడాదీ ప్రవేశ పరీక్షలో విఫలమవుతున్నా నిరాశకు గురికాలేదు. ఎట్టకేలకు 2020లో ఎంఎస్సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఇటీవలే ఎంఎస్సీ ఫైనల్‌ను పూర్తి చేశాడు. రాజ్‌కరణ్ బంగ్లాలలో పని చేస్తూ, యజమానుల నుంచి పలు అవమానాలు ఎదుర్కొన్నాడు. సరైన ఆహారం కూడా ఉండేది కాదు. అయినా ఉన్నత చదువులు కొనసాగించాలనే తపనతో అన్ని కష్టాలను భరించాడు. రాజ్‌కరణ్ ఆల్ ఇండియా రేడియోలో అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. పలు పాటల క్యాసెట్లను కూడా విడుదల చేశాడు. ప్రస్తుతం రాజ్ కరణ్ తన తల్లి, సోదరునితోపాటు ఉంటున్నాడు. రాజ్‌కరణ్‌కు ఇంకా పెళ్లికాలేదు. తనకు ప్రభుత్వ సహాయం అందిస్తే పాఠశాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు రాజ్ కరణ్ తెలిపాడు. ఫెయిల్యూర్‌తో కుంగిపోకుండా విద్యార్థులు చదువులో ముందుకు సాగాలని రాజ్ కరణ్ సలహా ఇస్తుంటాడు. ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ -
56 ఏళ్ల వయసులో ఎమ్మెస్సీ పాసైన సెక్యూరిటీ గార్డు! ఏకంగా 23 సార్లు..
కొందరూ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఇతర కారణాల వల్ల చదువు కోలేకపోవడం జరగుతుంది. ఐతే కొందరూ మాత్రం పట్టువదలకు పెద్దయ్యాక అయినా ఆ కలను నెరవేర్చుకుని మరీ చదువుకున్న ఎందరో వృద్ధుల ఉదంతాలను చూశాం. కానీ ఒక మాస్టర్ డిగ్రీలో ఫెయిలై సబ్జెక్టులు ఉండిపోతే పాసయ్యేంత వరకు ఎదురు చూసిన వ్యక్తిని చూశారా? అది కూడా దాదాపు సగం జీవితంపైనే ఓపిగ్గా గెలపు కోసం నిరీకిస్తూ పరీక్షలు రాయడం మాటలు గాదు కదా!. ఏకంగా 18 సార్లు ఫెయిల్ అయినా సరే..పరీక్షలు రాస్తూనే ఉన్నాడు. చివరికి ఎమ్సెస్సీలో ఉత్తీర్ణత సాధించడంతో ఒక్కసారిగా వార్తలో నిలిచాడు. వివరాల్లోకెళ్తే..జబల్పూర్కి చెందిన 56 ఏళ్ల రాజ్కరన్ అనే సెక్యూరిటీ గార్డుకి గణితంలో ఎంఎస్సీ చేయాలనేది ప్రగాఢ కోరిక. ఈ ఆలోచన 1996లో ఎంఏ పూర్తి చేసి పాఠశాల్లో విద్యార్థులకు గణితం బోధిస్తున్నప్పుడూ కలిగిందని చెబుతున్నాడు రాజ్కరన్. ఆ రోజుల్లో ఇలా ఎంఏ చేసిన వాళ్లు ఎంఏ మ్యాథ్స్ కూడా చేసే ఆప్షన్ ఉండటంతో తాను అదే ఏడాది జబల్పూర్లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో గణితంలో ఎంఎస్సీ మ్యాథ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించాడు. మ్యాథ్స్‌లో ఎంఎస్సీ ఎంత కష్టం అన్నది గ్రహించకుండా కేవలం తాను పిలల్లకు గణితం భోధించిన తీరుని అందరూ మెచ్చుకున్నారనే కారణంతో అనాలోచితంగా ఈ నిర్ణయం తీసేసుకున్నట్లు తెలిపాడు రాజ్కరన్. అయితే తొలిసారిగా ఎమ్మెస్సీ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 1997లో హాజరై, ఫెయిలయ్యానని, అలా పదేళ్లలో మొత్తం ఐదు సబ్జెక్టులలో కేవలం ఒక్క సబ్జెక్టులోనే పాసయ్యినట్లు తెలిపాడు. అయినా సరే ఇక వదిలేద్దా అని మాత్రం అస్సలు అనుకోలేదని చెప్పాడు. ఎలాగైన గణితంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అందుకోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ..ఎంఎస్సీ పరీక్షలకు ప్రిపేరైనట్లు తెలిపాడు. సుమారు 18 సార్లు ఫెయిల్ అయినట్లు తెలిపాడు. తొలిసారిగా 2020లో కోవిడ్ మహమ్మారి టైంలో ఫస్ట్ ఇయర్ పాసవ్వగా, 2021లో సెకండియర్ పాసవ్వడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎట్టకేలకు గణితంలో ఎమ్మెస్సీ పూర్తి చేయాలన్న తన 25 ఏళ్ల తపస్సు ఫలించిందని చెప్పుకొచ్చాడు. అయితే 18 సార్లు ఎమ్మెస్సీ ఫెయిలైన వ్యక్తిగా పేపర్లో తన గురించి రావడంతో ప్రజలంతా తనను చులకనగా చూడటం మొదలు పెట్టారని, అదే తనలో ఎలాగైన గెలవలనే తపనను మరింత పెంచిదని చెప్పాడు కరణ్. అలాగే సెక్యూరిటీ గార్డుగా అతడి నెల జీతం రూ. 5000/- మాత్రమే. అయినప్పటికి వ్యక్తితగ ఖర్చులు కొంత డబ్బుని తన పీజీ కోసం కేటాయించేవాడినని చెప్పాడు. అలా ఈ మాస్టర్ డిగ్రీ కోసం అని పుస్తకాలకు, పరీక్ష పీజులకైతే ఇప్పటి వరకు దాదాపు రూ. 2 లక్షలు పైనే ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ కల కోసం పెళ్లి కూడా చేసుకోలేదు అతడు. పైగా తనని అందరూ పెయిల్యూర్‌కి ఉదహారణగా చూపుతూ తమ పిల్లలకి హేళనగా చెప్పేవారో బాధగా తెలిపాడు. అయితే తానెప్పుడూ అవేమీ పట్టించుకోకుండా ఈ డిగ్రీని పూర్తిచేయడమే తన ధ్యేయంగా భావించానని చెప్పాడు. అంతేగాదు ఓపిగ్గా.. విసుగు లేకుండా ప్రయత్నించేవాడు తప్పక విజయం సాధిస్తాడనే విషయం తెలుసుకున్నానని సగర్వంగా చెబుతున్నాడు. పైగా ఈ లక్ష్యాన్నే తాను పెళ్లి చేసుకున్నానని మరో పెళ్లాం ఎందుకని చమత్కారంగా మాట్లాడాడు రాజ్‌కరణ్. (చదవండి: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్ మాట్లాడొద్దా?) -
Vidya: చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి.. నేనే ఉద్యోగం ఇస్తాను..
ఎం.ఎస్.సి డిజిటల్ సొసైటీ కోర్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ ఆమె. కాని ఆమె ఫ్రెండ్స్ అందరికీ క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు వచ్చాయి. ఆమెకు రాలేదు. ‘మీరు చూడగలిగితే బాగుండు’ అన్నారు అంతా. విద్యా పుట్టుకతో అంధురాలు. కాని అందరూ నిరాకరిస్తున్నా మేథమెటిక్స్‌లో గొప్ప ప్రావీణ్యం సంపాదించింది. ‘నాకు ఉద్యోగం ఇవ్వడం కాదు.. నాలాంటి వారికి నేనే ఉద్యోగాలు కల్పిస్తాను’ అని స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉపాధి చూపిస్తోంది విద్య. ఆమె ఎదుర్కొన్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ఆమె సాధిస్తున్న గెలుపులు కూడా. ‘ప్రపంచంలోని అంధుల జనాభాలో మూడొంతుల మంది భారతదేశంలో ఉన్నారు. వారిలో 70 శాతం మంది పల్లెల నుంచే ఉన్నారు. మన దేశంలో అంధ బాల బాలికల్లో 68 శాతమే చదువుకోవడానికి వెళుతున్నారు. వీరిలో మళ్లీ మేథ్స్, సైన్స్ వంటివి తీసుకోవడానికి స్కూల్స్ అంగీకరించవు. సాధారణ కోర్సులే వీళ్లు చదవాలి. ఏం? ఎందుకు వీళ్లు మేథ్స్ చదవకూడదు?’ అంటుంది విద్య. బెంగళూరుకు చెందిన ఈ పాతికేళ్ల అమ్మాయి ఎం.ఎస్.సిలో గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థ స్థాపించి దేశంలోని అంధ విద్యార్థినీ విద్యార్థులకు మేథ్స్, సైన్స్ చదవడంలో మెటీరియల్ తయారు చేస్తోంది. వారి కోసం ట్యూషన్లు, క్లాసులు ఏర్పాటు చేస్తుంది. వారికై పని చేసే అంధ టీచర్లనే సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు విద్యకు. కాని ఇప్పుడు విద్యే తన సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రిమెచ్యూర్ రెటినోపతి విద్య బెంగళూరు సమీపంలోని పల్లెటూరిలో పుట్టింది. సాధారణ జననమే. కాని పుట్టాక మూడు నెలలు ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రిమెచ్యూర్ రెటినోపతి వల్ల ఆమె రెండు కళ్లకూ చూపు పోయింది. ప్రపంచ సాక్షరతా దినోత్సవం రోజు పుట్టడం వల్ల, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ‘పాపకు ఎలాగూ కళ్లు రావు. కాని బాగా చదివిస్తే తన కాళ్ల మీద తాను నిలబడుతుంది’ అని సలహా ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు ‘విద్య’ అని పేరు పెట్టారు. ‘సాధారణంగా మన దేశంలో జరిగే తప్పేమిటంటే అంధ పిల్లలకు భవిష్యత్తు ఉండదని వారిని బడికి పంపరు పల్లెటూళ్లలో. నా అదృష్టం నా తల్లిదండ్రులు నన్ను బెంగళూరులోని ఒక మిషనరీ స్కూల్లో 7 ఏళ్ల వయసులో వేశారు. అక్కడే నేను 7 వ క్లాస్ వరకూ స్పెషల్ స్టూడెంట్‌గా చదువుకున్నాను. కాని అసలు సమస్య నా 8 వ తరగతి నుంచి అందరిలాగే మామూలు బడిలో చదువుకునే సమయంలో మొదలైంది‘ అంటుంది విద్య. లెక్కల పిచ్చి విద్యకు చిన్నప్పటి నుంచి లెక్కల పిచ్చి. ఇంట్లో చేటలో తల్లి బియ్యం పోసిస్తే ప్రతి గింజను లెక్క పెట్టేది. బియ్యం ఏమిటి... ఆవాలు పోసిచ్చినా ప్రతి ఆవాల గింజను లెక్క పెట్టేది. తల్లిదండ్రులు ఆమె లెక్కల ఇష్టాన్ని గమనించారు. కాని హైస్కూల్లో లెక్కలు చదవడం ఆమెకు కష్టమైంది. క్లాసులన్నీ బోర్డు మీద రాతలతో ఉంటాయి. మేథమెటికల్ సింబల్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ ఉంటాయి. వీటిని చూడకుండా అర్థం చేసుకోవడం అసాధ్యం. కాని విద్య పట్టుదలగా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించేంది. ‘నేను చేయాల్సింది మరిన్ని గంటలు కష్టపడటమే అని అర్థం చేసుకున్నాను. ఉదయం నాలుగున్నరకు లేచి చదివేదాన్ని’ అంటుంది విద్య. డిగ్రీలో మేథ్స్, కంప్యూటర్ సైన్స్ తీసుకుని కంప్యూటర్లో ఆడియో మెటీరియల్ ద్వారా వీలైనంత చదువుకుంటూ పాస్ అయ్యింది. ఆ తర్వాత బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటిలో ఎంఎస్సీ డిజిటల్ సొసైటీ కోర్సును టాపర్‌గా పాసైంది. ‘నా చదువుంతా నా ప్రయోగమే. నేను గణితాన్ని అర్థం చేసుకోవడానికి పడిన తపన, కష్టమే నా చదువు. ట్రిపుల్ ఐటి నుంచి మేథమేటిక్స్ ఆధారిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి స్టూడెంట్‌ని నేనే’ అంటుంది విద్య. అందరి కోసం విద్యకు ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి ఆమె అంధత్వం వల్ల. చాలా కంపెనీలు దయతలిచి కాల్‌సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థను బెంగళూరులో స్థాపించింది. నాలుగేళ్లుగా ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంధ విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతానికి కర్నాటకలోని అంధ విద్యార్థులను ప్రపంచ అంధ విద్యార్థులతో, విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తోంది. విద్య చేస్తున్న ఈ పనిని సమాజం గుర్తిస్తోంది. ఆమెను పిలిచి స్ఫూర్తివంతమైన ప్రసంగాలను వింటోంది. ‘అప్పుడే ఏమైంది. ఇది మొదలు మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది’ అంటోంది విద్య. చాలా కంపెనీలు దయతలిచి కాల్‌సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగ ప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే సంస్థను స్థాపించింది. -
13న ఎమ్మెస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : ఎమ్మెస్సీ (నర్సింగ్) కోర్సులో అడ్మిషన్ల కోసం ఈ నెల 13న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఆగస్టు 16న నిర్వహించిన ఎమ్మెస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని సూచించారు. ఈ మేరకు యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.2 వేలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1500 చొప్పున చెల్లించి కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు. కళాశాలలు, సీట్ల వివరాలు కౌన్సెలింగ్‌కు ఒకరోజు ముందు యూనివర్సిటీ వెబ్సైట్లో పెడతామని తెలిపారు. మరిన్ని వివరాలు ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్(Http://ntruhs.ap.nic.in) లో పొందవచ్చునని వివరించారు. -
టిస్ కోర్సులు... ప్రవేశాలు
దేశంలోని ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో ఒకటైన.. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) 2015-17 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. టిస్‌కు ముంబై, హైదరాబాద్, తుల్జాపూర్, గువహటిలలో క్యాంపస్‌లు ఉన్నాయి. తాజా నోటిఫికేషన్ ద్వారా ఈ నాలుగు క్యాంపస్‌లలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంహెచ్ఏ, ఎంపీహెచ్ వంటి విభాగాల్లో మొత్తం 49 రకాల కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తుంది. క్యాంపస్‌ల వారీగా అందిస్తున్న కోర్సులు.. హైదరాబాద్ క్యాంపస్: కోర్సు - సీట్లు ఎంఏ (రూరల్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్)- 30 ఎంఏ (ఎడ్యుకేషన్) -30 ఎంఏ (పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్)- 30 ఎంఏ (ఉమెన్ స్టడీస్)- 30 ఎంఏ (డెవలప్మెంట్ స్టడీస్)- 30 ఎంఏ (నేచురల్ రీసోర్సెస్ అండ్ గవర్నెన్స్) - 30 ప్రవేశం: ప్రవేశ ప్రక్రియ 225 మార్కులకు మూడు దశలుగా ఉంటుంది. వివరాలు.. రాత పరీక్ష (100 మార్కులు), ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ (పీఐటీ)/గ్రూప్ డిస్కషన్ (జీడీ-50 మార్కులు), పర్సనల్ ఇంటర్వ్యూ (75 మార్కులు). ఈ మూడు దశలకు కలిపి మొత్తం 225 మార్కులు కేటాయించారు. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆన్లైన్ విధానంలో ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ (పీఐటీ)/గ్రూప్ డిస్కషన్ కు హాజరు కావాలి. ఈ దశను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ క్రమంలో రాత పరీక్షకు 50 శాతం వెయిటేజీ, పీఐటీ/జీడీకి 20 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఇస్తారు. రాత పరీక్ష ఇలా: రాత పరీక్షలో అభ్యర్థుల ప్రజ్ఞా సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. సామాజిక అంశాలు, ప్రస్తుతం వివిధ రంగాల్లో జరుగుతున్న పరిణామాలతోపాటు అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ విభాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. డెమో కొశ్చన్ పేపర్, గతేడాది ప్రశ్నపత్రాలు వెబ్సైట్లో లభ్యమవుతాయి. వాటి ఆధారంగా ప్రశ్నల స్థాయి తెలుసుకోవచ్చు. రెండో దశ.. పీఐటీ: ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్.. రాత పరీక్ష (ఎస్సే) రూపంలో ఉంటుంది. ఇందుకు 45 నిమిషాల సమయం కేటాయించారు. ఎంచుకున్న క్యాంపస్, కోర్సును బట్టి ఎస్సే అంశాలు వేర్వేరుగా ఉంటాయి. దాదాపుగా అన్ని అంశాలు ఎంచుకున్న కోర్సు నేపథ్యంగా సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనల ఆధారంగా ఉంటాయి. నిర్దేశించిన పద పరిమితిలోనే ఎస్సేను పూర్తి చేయాలి. తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూలో సైతం ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ప్లేస్‌మెంట్స్: టిస్‌లో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాల పరంగా ఎటువంటి ఢోకా లేదని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా పలు కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. డెవలప్మెంట్ స్టడీస్ అభ్యర్థులను ఇంటర్నేషనల్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. హెచ్ఆర్ఎం అండ్ ఎల్ఆర్ (హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ రిలేషన్) అభ్యర్థులను హిందూస్థాన్ లీవర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, యాక్సిస్ బ్యాంక్, పలు ఐటీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. టిస్ ప్రవేశ ప్రక్రియ ఆధారంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, సోషల్ సెన్సైస్ అండ్ ట్రాన్స్‌డిసిప్లినరీ రీసెర్చ్ (ఐఎంహెచ్ఎస్టీ)-చెన్నై, మెంటల్ హెల్త్ యాక్షన్ ట్రస్ట్-కాలికట్, జీ-సెట్-రాంచీ ఇన్స్టిట్యూట్లలోని వివిధ కోర్సుల్లో కూడా ప్రవేశం పొందొచ్చు. తుల్జాపూర్ క్యాంపస్ ఎంఏ (రూరల్ డెవలప్మెంట్) ఎంఏ/ఎంఎస్సీ (డెవలప్మెంట్ పాలసీ, ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్) ఎంఏ (సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ఎంఏ/ఎంఎస్సీ (సస్టెయినబిలిటీ లైవ్లీహుడ్స్ అండ్ నేచురల్ రీసోర్సెస్ గవర్నెన్స్) గువహటి క్యాంపస్ ఎంఏ (ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టెయినబుల్టీ డెవలప్మెంట్) ఎంఏ (లేబర్ స్టడీస్ అండ్ సోషల్ ప్రొటెక్షన్) ఎంఏ (పీస్ అండ్ కన్ఫ్లిక్ట్ స్టడీస్) ఎంఏ (సోషియాలజీ అండ్ సోషల్ ఆంత్రోపాలజీ) ఎంఏ (సోషల్ వర్క్, నాలుగు స్పెషలైజేషన్స్‌తో) ముంబై క్యాంపస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ స్టడీస్ స్కూల్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ స్టడీస్ స్కూల్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్ ఆఫ్ హబిటాట్ స్టడీస్ ఎంఏ/ఎంఎస్సీ (డిజాస్టర్ మేనేజ్మెంట్) సెంటర్ ఫర్ హ్యుమన్ ఎకాలజీ స్కూల్ ఫర్ మీడియా అండ్ కల్చరల్ స్టడీస్ స్కూల్ ఆఫ్ లా, రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆన్లైన్ కోర్సులు: ఎంఏ (సోషల్ వర్క్ ఇన్ చైల్డ్ రైట్స్, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ స్టడీస్). ఈ స్కూల్స్‌లో పలు రకాల స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ సమాచారం అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ (10 + 2 + 3 లేదా 10 + 2 + 4 లేదా 10 + 2 + 2+ 1 విధానంలో, 15 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి). కోర్సుల వారీగా అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి సంబంధిత వివరాలను వెబ్సైట్ ద్వారా పొందొచ్చు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 29, 2014. పరీక్ష తేదీ: జనవరి 10, 2015. స్కోర్ కార్డులు పంపే తేదీ: ఫిబ్రవరి 3, 2015. పీఐటీ/ఇంటర్వ్యూ షెడ్యూల్: మార్చి 9-27, 2015. తుది ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 23, 2015. వివరాలకు: https://admissions.tiss.edu www.tiss.edu అదేవిధంగా 2015 సంవత్సరానికి ఎంఫిల్, పీహెచ్డీ, షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌లలో కూడా ప్రవేశానికి టిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెరిట్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 15, 2015. షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్‌ల విషయానికొస్తే.. ఎంచుకున్న విభాగాన్ని బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ కూడా ఎంచుకున్న కోర్సును బట్టి వేర్వేరుగా ఉంది. సోషల్సెన్సైస్తో సామాజిక అవగాహన సోషల్ సెన్సైస్ కోర్సులు అభ్యసించిన వారికి సమాజం, అభివృద్ధి క్రమంలో చోటు చేసుకునే సామాజిక మార్పులు పట్ల విస్తృత స్థాయిలో అవగాహన ఏర్పడుతుంది. టిస్‌లో ఎంఏ రూరల్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్, ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స కోర్సులకు డిమాండ్ ఉంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సైతం ఈ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత విద్య, పరిశోధన, సమాచారాన్ని భిన్న కోణాల్లో విశ్లేషించడంలో ఆసక్తి ఉన్నవారు ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్‌ను ఎంచుకుంటున్నారు. మహిళా సాధికారత, విద్యావిధానంలో మార్పులు, సహజ వనరులు, వాతావరణ మార్పులు తదితర అంశాలపై ఆసక్తి ఉన్నవారు ఎంఏ ఉమెన్స్ స్టడీస్, ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ నేచురల్ రిసోర్సెస్ అండ్ గవర్నెన్స కోర్సుల్లో చేరుతున్నారు. సోషల్ సైన్స కోర్సులు పూర్తిచేసిన వారు పంచాయతీలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలైన నేషనల్ లైవ్లీహుడ్స్ మిషన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఎంఎన్ఈఆర్జీఏ.. తదితర పథకాల్లో వివిధ హోదాల్లో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారికి నేర్చుకునే తత్వం, పరిశీలనా నైపుణ్యాలు, సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. అంతేకాకుండా వారికి ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉంటే త్వరగా ఉన్నత హోదాలో స్థిరపడొచ్చు. - డా. లక్ష్మీ లింగం, డిప్యూటీ డెరైక్టర్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, హైదరాబాద్. -
డిగ్రీ తర్వాత.. పయనమెటు?
అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీఎస్సీ, బీఏ, బీకామ్ వంటి సంప్రదాయ గ్రూప్‌లతో డిగ్రీ పూర్తిచేసిన వారు ఆయా డిగ్రీలలోని గ్రూప్ సబ్జెక్టులు లేదా అనుబంధ సబ్జెక్టులలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. ప్రస్తుతం పీజీలో సంప్రదాయ సబ్జెక్టులతో పాటు జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా వినూత్న స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ హ్యూమన్ జెనెటిక్స్, ఎంఎస్సీ కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ ఫిజికల్ ఓషనోగ్రఫీ వంటి కోర్సులను చెప్పుకోవచ్చు. ఇంకా సెన్సైస్ అభ్యర్థులకు.. కెమిస్ట్రీ (ఇన్ఆర్గానిక్/ఆర్గానిక్/ఫిజికల్ ఆర్గానిక్/ఫార్మాస్యూటికల్/ ఫార్మకోఇన్ఫర్మాటిక్స్), అప్లైడ్ మ్యాథమెటిక్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ, అప్లైడ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, బయోఫిజిక్స్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ జియోకెమిస్ట్రీ, నానోసైన్స్ తదితరాలు ఉన్నాయి. సోషల్ సెన్సైస్ అభ్యర్థులు ఎంఏలో సంప్రదాయ ఆప్షన్లతో పాటు ఆంత్రోపాలజీ, డెవలప్మెంట్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఆర్కియాలజీ, సోషియాలజీ, సోషల్‌వర్క్, సైకాలజీ వంటి సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకోవచ్చు.ఎంకామ్‌లో.. ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫైనాన్స్ అండ్ కంట్రోల్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వంటివి ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీలు, జేఎన్‌యూ-న్యూఢిల్లీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు అన్ని రకాల ఆప్షన్స్‌తో పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ సైన్స్ అభ్యర్థులు డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్డీ చేసే అవకాశాన్ని కొన్ని కోర్సులు కల్పిస్తున్నాయి. ఈ కోర్సులను ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలుగా వ్యవహరిస్తారు. ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు, బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్- బెంగళూరు బయలాజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్.. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్డీ (ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్) కోర్సును ఇగ్నో సహకారంతో నిర్వహిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీకే పరిమితం కాకుండా విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారిస్తే కెరీర్లో ఉన్నతంగా స్థిరపడవచ్చు. ఈ క్రమంలో పీజీ తర్వాత యూజీసీ-నెట్, సీఎస్ఐఆర్-నెట్ ద్వారా పీహెచ్డీ చేయొచ్చు. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి పరిగణించే అర్హతల్లో నెట్/జేఆర్ఎఫ్ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. సోషల్ సెన్సైస్ అభ్యర్థులకు కేవలం నెట్ ద్వారానే కాకుండా పరిశోధన కోర్సుల్లో చేరే అవకాశాన్ని కొన్ని ప్రముఖ ఇన్స్టిట్యూట్లు కల్పిస్తున్నాయి. అవి.. టిస్, సీఎస్డీఎస్, తదితరాలు. అభ్యర్థులు పంపించిన ప్రాజెక్ట్ ప్రతిపాదనల ఆధారంగా ఆయా ఇన్స్టిట్యూట్లు ప్రవేశం కల్పిస్తున్నాయి. మేనేజ్మెంట్ దిశగా అడుగులు డిగ్రీ తర్వాత మేనేజ్మెంట్ కెరీర్ వైపు దృష్టి సారించాలనుకుంటే ఎంబీఏ కోర్సును ఎంచుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఐసెట్ లేదా జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఎక్స్‌ఏటీ వంటి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. టెక్నికల్ వైపు ఆసక్తి ఉంటే ఎంసీఏ కోర్సును ఎంచుకోవచ్చు. ఇందుకోసం కూడా ఐసెట్ (ఇంటర్మీడియెట్ వరకు మ్యాథమెటిక్స్ చదివిన అభ్యర్థులు మాత్రమే ఎంసీఏకు అర్హులు) పరీక్ష రాయాలి. అత్యధిక మంది ఎంపిక టీచింగ్ సంప్రదాయ డిగ్రీ కోర్సుల తర్వాత అత్యధిక మంది విద్యార్థులు టీచింగ్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఈ విభాగంలో డిగ్రీ తర్వాత బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో ప్రవేశానికి ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) రాయాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సు అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను బోధించడానికి కొన్ని ప్రత్యేక స్కిల్స్ ఉండాలి. అటువంటి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఉద్దేశించినవి లాంగ్వేజ్ పండిట్ కోర్సులు. వీటిల్లో ప్రవేశానికి లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎల్పీసెట్) రాయాలి. మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలోని పలు ఇన్స్టిట్యూట్లు ఈ విభాగంలో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు. లా కోర్సులు న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే లా కోర్సులను ఎంచుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)కు హాజరు కావచ్చు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్), ఏఐఎల్ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్), లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా(ఎల్‌శాట్) తదితర ప్రవేశ పరీక్షలకు హాజరు కావచ్చు. జర్నలిజం భారతదేశంలో మీడియాలోకి విదేశీ పెట్టుబడులను కేంద్రం అనుమతిస్తుండడంతో ఈ రంగంలోకి అనేక సంస్థలు ప్రవేశిస్తున్నాయి. దీంతో మీడియా రంగంలో అవకాశాలు కోకొల్లలు అని చెప్పొచ్చు. మీడియా మాస్ కమ్యూనికేషన్ అంటే ఒక్క ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియానే కాదు... ఇంకా సినిమాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, రేడియోలు, పరిశ్రమలు, సంస్థల్లో పబ్లిక్ రిలేషన్ విభాగం, ఎడిటింగ్, స్క్రిప్ట్‌రైటింగ్, మ్యాగజైన్స్, వెబ్ జర్నలిజం.. ఇలా అన్నీ వస్తాయి. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన సాధనాలు పత్రికలు, టీవీలు. అందుకే గత ఐదేళ్లలో భారతదేశంలో టీవీ, పత్రికా రంగాలు గణనీయంగా వృద్ధి చెందాయి. దేశంలో జర్నలిజంలో శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో ఉన్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పేరుతో రెండేళ్ల కోర్సు నిర్వహిస్తున్నాయి. మీడియాలో పోటీ నెలకొనడంతో నిష్ణాతులైన అభ్యర్థుల కోసం దేశవ్యాప్తంగా అనేక పత్రికలు, ఛానళ్లు సొంతంగా జర్నలిజంలో శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు నేరుగా విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రధాన దినపత్రికలన్నింటికి సొంతంగా జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో నియామకాలకు ఖాళీలను బట్టి నోటిఫికేషన్లు విడుదల చేసి అభ్యర్థులను భర్తీ చేసుకుంటాయి. కొత్త కెరీర్లు డిగ్రీ విద్యార్థులు ప్రస్తుతం ఆవిర్భవించిన నూతన కెరీర్ వేదికల వైపు దృష్టి సారించడం ద్వారా మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. అటువంటి వాటిలో కొన్ని.. ఫ్యాషన్ డిజైనింగ్, రిటైల్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, ఫార్మా, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆఫర్ చేసే ఫైనాన్షియల్ కోర్సులు, కార్పొరేట్ కమ్యూనికేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్, బీపీఓ, కెపీఓ, మెడికల్ ట్రాన్స్కిప్షన్. వీటికి సంబంధించి ఆయా విభాగాల్లో ఉండే పీజీ లేదా పీజీ డిప్లొమా, స్వల్ప కాలిక వ్యవధితో ఉండే డిప్లొమా కోర్సులను ఎంచుకోవచ్చు. తద్వారా మెరుగైన కెరీర్ దిశగా అడుగులు వేయవచ్చు. అందుకు అనుగుణంగా స్కిల్స్ మెరుగుపర్చుకోవడం తప్పనిసరి. బాసటగా విదేశీ భాషలు ప్రపంచీకరణ వల్ల పారిశ్రామిక రంగంతోపాటు వివిధ రంగాల్లో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ భాషల్లో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం పెరుగుతుంది. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాల భాష తెలిసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్ భాషలకు బాగా డిమాండ్ ఉంది. ఉస్మానియా, ఇఫ్లూ, జేఎన్‌యూ వంటి యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్న సంబంధిత కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రిటేటర్, టీచింగ్, ఫ్రీలాన్సింగ్ వంటి రంగాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. ఉద్యోగమే లక్ష్యమైతే ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి సంబంధించి యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారుు. ఈ పరీక్షల్లో రాణించేందుకు అకెడమిక్స్ చదువుతూనే పోటీ పరీక్షల కోసం సిద్ధంకావాలి. ప్రతి రోజూ తాజా సమాచారాన్ని నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. ఆయా పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఇంటర్నెట్, పత్రికలు వంటి మాధ్యమాల ద్వారా సంబంధిత పరీక్షల సమాచారాన్ని క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. గత విజేతలు, నిపుణులు సూచించిన ప్రామాణిక మెటీరియల్‌తో సన్నద్ధతను సాగించాలి. అవసరమైతే కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ప్రైవేటు రంగంలో ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు అనుభవానికే ప్రాధాన్యమివ్వాలి. ఫలానా ఉద్యోగమే’ కావాలని వేచిచూసి.. సమయం వృథా చేసుకోకుండా.. అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలి. అనుభవం సంపాదించాలి. తద్వారా ఆ రంగంలో ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలి. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూనే సంబంధిత రంగంలో ఉన్నత విద్య అవకాశాలను అన్వేషించాలి. ప్రోత్సాహకాలు ప్రస్తుతం సైన్స్ విభాగంలో పీహెచ్డీ చేసిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దాంతో సంబంధిత విభాగాలు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రాథమిక దశ నుంచే విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పలు రకాల స్కాలర్షిప్లు, ఫెలోషిప్లను అందజేస్తుంది. అవి.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై-www.kvpy.org.in), ఇన్స్పైర్ స్కాలర్షిప్స్/ఫెలోషిప్స్ (www.inspire-dst.gov.in), యూజీసీ కూడా దాదాపు 13 రకాల ఫెలోషిప్స్/ స్కాలర్షిప్స్ (ఠీఠీఠీ.ఠజఛి.్చఛి.జీ)ను, స్వర్ణజయంతి ఫెలోషిప్స్, మహిళల కోసం ఉమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కింద ఎన్నో రకాల స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తుంది. కేవలం బ్యాచిలర్ డిగ్రీకే పరిమితం కాకుండా, పీజీ/పీహెచ్డీ వంటి ఎన్నో ఉన్నత కోర్సులను చదవడానికి, పరిశోధనల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈ స్కాలర్షిప్స్ ఉపయోగపడతాయి. దీన్ని బట్టి సైన్స్ స్ట్రీమ్‌కు ఎంత ప్రాధాన్యత లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సైన్స్ కోర్సులను చదివితే అవకాశాలు పుష్కలం అని చెప్పొచ్చు. జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీలకు డిమాండ్ ప్రస్తుతం జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే బ్యాచిలర్ స్థాయిలో వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. బీఎస్సీతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాల్లో రెండు, మూడు వారాల పాటు శిక్షణ ఇస్తున్నాం. ఆర్ట్స్ చదివే విద్యార్థులు కూడా కంప్యూటర్స్‌పై అవగాహన, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ అప్లికేషన్ వంటి అంశాలను నేర్చుకుంటున్నారు. బీఎస్సీలో న్యూట్రిషిన్, ఫుడ్ టెక్నాలజీ వంటి కాంబినేషన్లు ఉండటం వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ఉద్యోగావకాశాలుంటున్నాయి. ప్రస్తుతం ఇలాంటి కోర్సులు పూర్తిచేసిన వారు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఉన్నత విద్య దిశగా వెళ్లాలంటే పీజీ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం వల్ల కెరీర్ పరంగా మెరుగైన అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. సొంత ప్రాజెక్టులతో అయితే స్వయం ఉపాధి పొందడంతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పించవచ్చు. - ప్రొఫెసర్ బి.టి.సీత, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ (మహిళలు), హైదరాబాద్. -
లేబర్ మేస్త్రీ కొడుకు సివిల్స్ విజేత
జలుమూరు : మండలంలోని జోనంకి పంచాయతీ గంగాధరపేటకు చెందిన పూజారి కృష్ణారావు సివిల్ సర్వీస్-2013లో 776 ర్యాంక్ సాధించారు. జిల్లాతోపాటు స్వగ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. తండ్రి అప్పలనాయడు వృత్తిరీత్యా లేబర్ మేస్త్రీ. తల్లి భూదేవి గృహిని. తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులే. నిర్లక్షరాస్యుల ఇంట సర్వతీ పుత్రుడు జన్మించాడు. కృష్ణారావు ఉన్నత శిఖరాలను అధిరోహించి యవతీ యవకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఒకటి నుంచి ఐదో వరకు హుస్సేనుపురం పంచాయతీ తమ్మయ్యపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. ఆరో తరగతి విశాఖపట్నంలో చదివారు. ఏడు నుంచి 10వ తరగతి వరకు సింహాచలం రెసిడెన్సియల్ స్కూల్లో విద్యనభ్యసించారు. ఇంటర్, డిగ్రీ కూడా విశాఖలో పూర్తి చేశారు. చెన్నైలో అప్లయిడ్ బయోలాజీ (ఎంస్సీ) పూర్తి చేశారు. కృష్ణారావు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2011 కేంద్ర హోమంత్రిత్వ శాఖలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. లక్ష్యం కోసం నిరంతరం సాధన చేయాలి మనం ఏది సాధించాలనుకున్నామో ఆ లక్ష్యం కోసం నిరంతరం సాధన చేయాలి. అన్నిటి కంటే మన మీద మనకు నమ్మకం ప్రధానం. లక్ష్యాన్ని చేరుకునేందుకు నిజాయితీగా కష్టించి పనిచేయాలి. తరువాత విజయం మనల్ని వరిస్తుంది. నేను ఈ స్థాయికివెళ్లడానికి తల్లిదండ్రులుతోపాటు భార్య మనీషా ఎంతో సహకారం అందించారు. భార్య వృత్తిరీత్తా వైద్యురాలు. ఆమె ఎంతో బిజీగా ఉన్నా... నా బాధ్యతలను నిరంతరం గుర్తు చేసి, విజయానికి ఎంతో సహకారం అందించారు. పూజారి కృష్ణారావు, సివిల్స్ విజేత -
నిట్‌లో ఎంఎస్సీ కోర్సులకు.. నిట్వెట్
ఇంజనీరింగ్ విద్య అంటే ఐఐటీల తర్వాత గుర్తొచ్చేవి.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు. ఈ ఇన్స్టిట్యూట్లు కేవలం ఇంజనీరింగ్ కోర్సులను మాత్రమే కాకుండా విభిన్న సబ్జెక్ట్‌లలో ఎంఎస్సీ కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఆ క్రమంలో మన రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)-వరంగల్, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నిట్వెట్ (నిట్ వరంగల్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఎస్సీ టెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అర్హత: 60 శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్లతో బీఎస్సీ వ్యవధి: మూడు సంవత్సరాలు (ఆరు సెమిస్టర్లు) ఎంఎస్సీ (అప్లయిడ్ మ్యాథమెటిక్స్) వ్యవధి: రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు) ఎంఎస్సీ(మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్) వ్యవధి: రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు) అర్హత: 60 శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏతో మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్ట్‌గా బీఎస్సీ/బీఏ ఎంఎస్సీ కెమిస్ట్రీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) వ్యవధి: రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు) ఎంఎస్సీ కెమిస్ట్రీ (అనలిటికల్ కెమిస్ట్రీ) అర్హత: 60 శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏతో కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌గా బీఎస్సీ సీట్ల వివరాలు: అందుబాటులో ఉన్న సీట్లలో 50 శాతం సీట్లను జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్-ఐఐటీల్లో ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష) ద్వారా భర్తీ చేస్తారు. మిగతా 50 శాతం సీట్లలో ప్రవేశాలను నిట్వెట్ ద్వారా చేపడతారు. ఈ క్రమంలో ఎంఎస్సీ(టెక్) ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీలో చెరో 24 సీట్లు చొప్పున మొత్తం 72 సీట్లు ఉన్నాయి. ప్రవేశం: జాతీయ స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా. రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 80 ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి రెండు గంటల సమయం కేటాయించారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ ఉంది. తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. సబ్జెక్ట్‌ల వారీగా: మ్యాథమెటిక్స్ కోర్సులకు సంబంధించి మోడ్రన్ అల్జీబ్రా, లీనియర్ ఆల్జీబ్రా, మ్యాథమెటికల్ అనాలిసిస్, వెక్టార్ కాలిక్యులస్, కోఆర్డినేట్ జ్యామెట్రీ ఆఫ్ త్రీ డెమైన్షన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.ఇంజనీరింగ్ ఫిజిక్స్‌లో జియోమెట్రికల్ ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్, మెకానిక్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నటిజం, మోడ్రన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. కెమిస్ట్రీ కోర్సుల కోసం నిర్వహించే రాత పరీక్షలో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్-1ఏ, 2ఏ3బి, 4బి, 5బి, 6బి, 7బి, గ్రూప్ జిరో ఎలిమెంట్స్, డి-బ్లాక్, మెటలర్జీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యుల్స్, ఆల్కేన్స్, రియాక్టివిటీ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యుల్స్, ఆల్కీ న్స్, ఆల్కైన్స్, హాలోజన్ కాంపౌండ్స్, ఈథర్స్, కార్బనల్ కాంపౌండ్స్, ఆప్టికల్ ఐసోమార్సిజమ్, క్లాసిఫికేషన్ ఆఫ నేచురల్ ఆమైనో యాసిడ్స్, కార్బొహైడ్రేట్స్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ ఈక్విలిబ్రియం, గ్యాసెస్ స్టేట్, లిక్విడ్స్, సాలిడ్స్, ఫేజ్ రూల్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్ నుంచి అంశాలు ప్రశ్నలు వస్తాయి. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు ఫీజు: రూ. 800లు (ఎస్సీ, ఎస్టీలకు రూ.400 లు) దరఖాస్తు అప్లోడింగ్ (ఆన్లై న్లో): ఏప్రిల్ 24, 2014 దరఖాస్తు, సంబంధిత పత్రాల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2014. రాత పరీక్ష తేదీలు: మే 10,11 ఫలితాల వెల్లడి: మే 19, 2014 వివరాలకు: www.nitwet2014.nitw.ac.in సిలబస్‌పై పట్టు ఎంసెట్ కన్నా కొద్దిగా కఠినమైన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ప్రతి అంశానికి సంబంధించినప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. అనుభవం కలిగిన అధ్యాపకుల సలహాలు, సూచనలతో ప్రిపరేషన్ సాగిస్తే మెరుగైన ర్యాంకు సాధించడానికి అవకాశం ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. కాబట్టి సరైన సమాధానం తెలియని వాటిని విడిచిపెట్టడం మేలు. రోజుకు కనీసం 8 గంటలు చదవాలి. మోడల్పేపర్లను సాధన చేయడం లాభిస్తుంది. కోర్సు పూర్తిచేసిన వారికి పరిశోధన, బోధన రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. రీసర్చ్ల్యాబ్స్కు వెళ్లడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, వివిధ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. ప్రాంగణఎంపిక (క్యాంపస్ సెలక్షన్స్)లో ప్రాధాన్యత ఉంటుంది. ఫ్యాకల్టీపరమైన ఉద్యోగ అవకాశాలూ మెండుగా ఉంటాయి. సహకారం: కొత్తపల్లి శివశంకర్, న్యూస్‌లైన్, నిట్ క్యాంపస్, వరంగల్ -
ఓయూ సెట్ రాయకున్నా పీజీ ప్రవేశాలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ప్రైవేటు పీజీ కళాశాలల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 5వేల సీట్లు మిగిలాయి. వీటిని ఆయా కళాశాలల యజమానులు కన్వీనర్ కోటా ఫీజులపై ఈ నెల 31 వరకు భర్తీ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఓయూసెట్-2013 ప్రవేశ పరీక్ష రాయకున్నా డిగ్రీలో 50 శాతానికిపైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఆయా ప్రైవేటు పీజీ కళాశాలల కోర్సుల్లో ప్రవేశం పొందే వెసులుబాటును అధికారులు కల్పించారు. అయితే, ఇలా చేరే విద్యార్థులకు ఉపకార వేతనం రాదని చెప్పారు. భర్తీ అయిన సీట్ల వివరాల జాబితాను సెప్టెంబరు 3 వరకు ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో సమర్పించాలని జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి ఆయా కాలేజీలకు సూచించారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 1300 సీట్లు, ఎంకాం 500 సీట్లు, ఎమ్మెస్సీ గణితం 500 సీట్లు, ఎమ్మెస్సీ ఫిజిక్స్ 250 సీట్లు మిగిలిపోయినట్టు అధికారులు తెలిపారు.