నిట్‌లో ఎంఎస్సీ కోర్సులకు.. నిట్‌వెట్
Published Thu, Apr 24 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM
ఇంజనీరింగ్ విద్య అంటే ఐఐటీల తర్వాత గుర్తొచ్చేవి.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు కేవలం ఇంజనీరింగ్ కోర్సులను మాత్రమే కాకుండా విభిన్న సబ్జెక్ట్‌లలో ఎంఎస్సీ కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఆ క్రమంలో మన రాష్ట్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)-వరంగల్, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నిట్‌వెట్ (నిట్ వరంగల్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
ఎంఎస్సీ టెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్
అర్హత: 60 శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లతో బీఎస్సీ
వ్యవధి: మూడు సంవత్సరాలు (ఆరు సెమిస్టర్లు)
ఎంఎస్సీ (అప్లయిడ్ మ్యాథమెటిక్స్)
వ్యవధి: రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు)
ఎంఎస్సీ(మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్)
వ్యవధి: రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు)
అర్హత: 60 శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏతో మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్ట్‌గా బీఎస్సీ/బీఏ
ఎంఎస్సీ కెమిస్ట్రీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ)
వ్యవధి: రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు)
ఎంఎస్సీ కెమిస్ట్రీ (అనలిటికల్ కెమిస్ట్రీ)
అర్హత: 60 శాతం మార్కులు/తత్సమాన సీజీపీఏతో కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌గా బీఎస్సీ
సీట్ల వివరాలు:
అందుబాటులో ఉన్న సీట్లలో 50 శాతం సీట్లను జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్-ఐఐటీల్లో ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష) ద్వారా భర్తీ చేస్తారు. మిగతా 50 శాతం సీట్లలో ప్రవేశాలను నిట్‌వెట్ ద్వారా చేపడతారు. ఈ క్రమంలో ఎంఎస్సీ(టెక్) ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీలో చెరో 24 సీట్లు చొప్పున మొత్తం 72 సీట్లు ఉన్నాయి.
ప్రవేశం:
జాతీయ స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా. రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 80 ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి రెండు గంటల సమయం కేటాయించారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ ఉంది. తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
సబ్జెక్ట్‌ల వారీగా:
మ్యాథమెటిక్స్ కోర్సులకు సంబంధించి మోడ్రన్ అల్జీబ్రా, లీనియర్ ఆల్జీబ్రా, మ్యాథమెటికల్ అనాలిసిస్, వెక్టార్ కాలిక్యులస్, కోఆర్డినేట్ జ్యామెట్రీ ఆఫ్ త్రీ డెమైన్షన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.ఇంజనీరింగ్ ఫిజిక్స్‌లో జియోమెట్రికల్ ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్, మెకానిక్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నటిజం, మోడ్రన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
కెమిస్ట్రీ కోర్సుల కోసం నిర్వహించే రాత పరీక్షలో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్-1ఏ, 2ఏ3బి, 4బి, 5బి, 6బి, 7బి, గ్రూప్ జిరో ఎలిమెంట్స్, డి-బ్లాక్, మెటలర్జీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యుల్స్, ఆల్కేన్స్, రియాక్టివిటీ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యుల్స్, ఆల్కీ న్స్, ఆల్కైన్స్, హాలోజన్ కాంపౌండ్స్, ఈథర్స్, కార్బనల్ కాంపౌండ్స్, ఆప్టికల్ ఐసోమార్సిజమ్, క్లాసిఫికేషన్ ఆఫ నేచురల్ ఆమైనో యాసిడ్స్, కార్బొహైడ్రేట్స్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ ఈక్విలిబ్రియం, గ్యాసెస్ స్టేట్, లిక్విడ్స్, సాలిడ్స్, ఫేజ్ రూల్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్ నుంచి అంశాలు ప్రశ్నలు వస్తాయి.
నోటిఫికేషన్ సమాచారం:
దరఖాస్తు ఫీజు: రూ. 800లు
(ఎస్సీ, ఎస్టీలకు రూ.400 లు)
దరఖాస్తు అప్‌లోడింగ్ (ఆన్‌లై న్‌లో): ఏప్రిల్ 24, 2014
దరఖాస్తు, సంబంధిత పత్రాల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2014.
రాత పరీక్ష తేదీలు: మే 10,11
ఫలితాల వెల్లడి: మే 19, 2014
వివరాలకు: www.nitwet2014.nitw.ac.in
సిలబస్‌పై పట్టు
ఎంసెట్ కన్నా కొద్దిగా కఠినమైన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ప్రతి అంశానికి సంబంధించినప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. అనుభవం కలిగిన అధ్యాపకుల సలహాలు, సూచనలతో ప్రిపరేషన్ సాగిస్తే మెరుగైన ర్యాంకు సాధించడానికి అవకాశం ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. కాబట్టి సరైన సమాధానం తెలియని వాటిని విడిచిపెట్టడం మేలు. రోజుకు కనీసం 8 గంటలు చదవాలి. మోడల్‌పేపర్లను సాధన చేయడం లాభిస్తుంది. కోర్సు పూర్తిచేసిన వారికి పరిశోధన, బోధన రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. రీసర్చ్‌ల్యాబ్స్‌కు వెళ్లడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్, వివిధ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. ప్రాంగణఎంపిక (క్యాంపస్ సెలక్షన్స్)లో ప్రాధాన్యత ఉంటుంది. ఫ్యాకల్టీపరమైన ఉద్యోగ అవకాశాలూ మెండుగా ఉంటాయి.
సహకారం: కొత్తపల్లి శివశంకర్, న్యూస్‌లైన్,
నిట్ క్యాంపస్, వరంగల్
Advertisement
Advertisement