ఏలూరు : ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఉచితంగా నిరుపేదలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ప్రారంభించారు. అలాగే 102, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ను ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని చంద్రబాబు చెప్పారు.
నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయం అందిస్తామని, ఫిబ్రవరి 1 నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 270 వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ బాధ్యతను ఔట్ సోర్సింగ్కు అప్పగిస్తామని తెలిపారు. ఇక గోదావరి జిల్లాల్లో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత తమదేనని, ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ సీలేరు జలాశయాలు తీసుకు వస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు
Published Fri, Jan 1 2016 5:13 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM
Advertisement