మే 24న జేఈఈ అడ్వాన్స్‌డ్ టెస్ట్
జూన్ 8న కీ, 13న మార్కులు జూన్ 18న ర్యాంకుల ప్రకటన
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీ), ధన్‌బాద్‌లోని ఇండియ న్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం), ఇతర ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థల్లో వచ్చే ఏడాది బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) తదితర కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ (అడ్వాన్స్‌డ్)-2015 పరీక్ష షెడ్యూలును ముంబై ఐఐటీ శని వారం ప్రకటించింది. వచ్చే ఏడాది మే 24న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది.
ఇదీ అర్హత విధానం..
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు వచ్చేఏడాది ఏప్రిల్‌లోనే నిర్వహించే జేఈఈ మెయిన్ -2015 పేపరు-1 పరీక్ష రాసిన వారినే జే ఈఈ అడ్వాన్స్‌డ్ టెస్ట్‌కు అనుమతిస్తారు. అదీ జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు సాధించిన టాప్ 1.50 లక్షల మంది విద్యార్థుల్లో ఉండాల్సిందే. ఇక ఐఐటీల్లో సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతోపాటు సంబంధిత 12వ తరగతి/ ఇంటర్మీడియట్ బోర్డులలో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. దీని నిర్ధారణకు ఇంటర్ రెండేళ్ల మార్కులను పరిగణనలోకి తీ సుకుంటారు. 75 శాతం(జనరల్), ఓబీసీ, 70 శాతం (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు) మార్కులు సాధించి ఉండాలి. ఈ రెం డింటిలో ఏ ఒక్కదానిలో ఏ నిబంధనకు అర్హత సాధించినా ఐఐటీలో చేరేందుకు అర్హులే. ఒకవేళ సంబంధిత బోర్డు టాప్-20 పర్సంటైల్‌ను ప్రకటించకపోతే దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను అభ్యర్థి అందజేయాలి. ఒకవేళ బోర్డు మార్కులు ఇవ్వకుండా గ్రేడ్లు ఇస్తే.. ఆ గ్రేడ్లు ఎన్ని మార్కులకు సమానం అనే అంశాన్ని పేర్కొంటూ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వాలి. దా నిపై ప్రవేశాల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
ఐఐటీ ముంబయి ఆధ్వర్యంలో..
జేఈఈ అడ్వాన్స్‌డ్-2014 పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించగా, జేఈఈ అడ్వాన్స్‌డ్-2015 ఐఐటీ ముంబయి నిర్వహిస్తోంది. ఏడు ఐఐటీ భాగస్వామ్యంతో ముంబయి ఐఐటీ నేతృత్వంలో పరీక్ష నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ)-15 నిర్ణయించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ కో సం మే 2వ తేదీ నుంచి 7 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఇందుకవసరమైన ఏర్పాట్లు చేస్తూ, షెడ్యూలును జారీ చేసింది.
ఇవీ పరీక్ష కేంద్రాలు...
తెలంగాణ, ఏపీల్లో ఐదు కేంద్రాల్లో ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఐఐటీ ఖరగ్‌పూర్ పరిధిలోని విశాఖపట్నం, ఐఐటీ మద్రాసు పరిధిలోని నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది.
ఇవీ ప్రవేశాలు చేపట్టే కోర్సులు..
బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బీటెక్, ఎంటెక్ ఐదేళ్ల డ్యుయల్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ డ్యుయల్ డిగ్రీ, బీటెక్ అండ్ మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డ్యుయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ మాస్టర్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, ఇంటిగ్రెటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ (టెక్నాలజీ).
ఇదీ జేఈఈ అడ్వాన్స్‌డ్-2015 షెడ్యూల్..
►2015 మే 2 నుంచి 7 వరకు: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ హా మే 9 నుంచి 12 వరకు: హాల్ టికెట్ల (అడ్మిట్ కార్డు) డౌన్‌లోడ్ హా 9వ తేదీ నుంచి 14 వరకు: హాల్ టికెట్ల పొరపాట్లు ఉంటే సవరించుకునే అవకాశం హా మే 24న : రాత పరీక్ష (ఉదయం 9 నుంచి 12 గం. వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గం. వరకు పేపరు-2 పరీక్ష.) హా జూన్ 3 నుంచి 5 వరకు: ఆన్‌లైన్‌లో ఓఎంఆర్ జవాబు పత్రాల ప్రదర్శన. హా 3 నుంచి 6వ తేదీ వరకు: జవాబు పత్రాలపై అభ్యంతరాలు స్వీకరణ. హా 8వ తేదీన: ఆన్‌లైన్‌లో జవాబుల కీ. హా 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు: జవాబు కీలపై అభ్యంతరాలు స్వీకరణ. హా 13వ తేదీన: మార్కులు విడుదల హా 18వ తేదీన: ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటన
బ్యాచిలర్ ఆర్కిటెక్చర్ షెడ్యూలు..
► జూన్ 18 నుంచి 19 వరకు: ఆర్కిటెక్చర్ ఆప్జిట్యూడ్ టెస్టుకు (ఏఏటీ) ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ. హా 21వ తేదీన: ఏఏటీ రాత పరీక్ష (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు). హా 25వ తేదీన: ఏఏటీ ఫలితాలు విడుదల.
► జూన్ 26 నుంచి 30వ తేదీ వరకు: ఆన్‌లైన్‌లో ఆప్షన్లకు (ఛాయిస్) అవకాశం.
► జులై 2న: మొదటి దశ సీట్లు కేటాయింపు. హా 2 నుంచి 8వ తేదీ వరకు ప్రవేశాలకు ఆమోదం, కాలేజీల్లో చేరికలు.హా 10వ తేదీన రెండో దశ సీట్లు కేటాయింపు.
► 11 నుంచి 15వ తేదీ వరకు ప్రవేశాల ఆమోదం, కాలేజీల్లో చేరి కలు. హా జులై 16 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం.