బొలేరో బోల్తా: ఒకరి మృతి | one dies of bolero rolls in ysr district | Sakshi
Sakshi News home page

బొలేరో బోల్తా: ఒకరి మృతి

Published Sun, Aug 2 2015 5:03 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

one dies of bolero rolls in ysr district

రైల్వేకోడూరు: కడప - తిరుపతి జాతీయ రహదారి శెట్టిగుంట వద్ద ఆదివారం సాయంత్రం బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రామచంద్రరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో పది మంది గాయపడ్డారు. వివరాలు.. వైఎస్సార్ జిల్లా మాధవరంపోడు గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలవారు పది వాహనాల్లో అంజేరమ్మ దేవతకు మొక్కు చెల్లించుకునేందుకు వెళ్లి వస్తుండగా శెట్టిగుంట వద్ద వారి వాహనం టైరు పగిలి.. బోల్తాపడడంతో జగదది రామచంద్రరాజు (50) అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనంలో ఉన్న పది మంది గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. శెట్టిగుంట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement