సాక్షి, యానాం : ఓఎన్‌జీసీ కాంట్రాక్ట్ కార్మికులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలుసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రజాసంకల్పయాత్ర 203వ రోజు పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ వారి తాను ఉన్నానంటూ భరోసానిస్తున్న రాజన్న తనయుడు వైఎస్ జగన్‌కు ఓఎన్‌జీసీ కార్మికులు తమ కష్టాలు చెప్పుకున్నారు. అకారణంగా నిన్నటినుంచి 36 మందిని పనిలోంచి తొలగించారని కార్మికులు వాపోయారు. ‘ఓఎన్‌జీసీ ఫైర్ ఫైటర్స్ సంస్థలో జరిగే ప్రమాదాలతో పాటు చుట్టుపక్కల ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా స్పందిస్తున్నాం. ఓఎన్‌జీసీ సంస్థ ప్రారంభం నుంచి మేం పనిచేస్తున్నాం.
ఆ పదివేల జీతానికి కూడా నష్టాలు వస్తున్నాయని సాకుగా చూపించి మమ్మల్ని పనిలోంచి తొలగిస్తున్నారు. మా భూములు తీసుకుని ఉపాధి కల్పించినట్లే కల్పించి.. కార్మికులను తొలగించడం ఎంతవరకు న్యాయం. 36 మందిని పనిలోంచి తొలగించి కేవలం ముగ్గురుతో ఎలా నెట్టుకొస్తారు. అత్యంత ప్రమాదకరమైన పెట్రోలియం ప్లాంట్‌లలో ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించినా పట్టించుకోవడం లేదు. తమను ఉద్యోగంలో కొనసాగించడంతో పాటు పర్మినెంట్ చేయాలని కోరుతున్నాం. మాకు న్యాయం జరిగేలా చూడాలన్నా’ అంటూ ఓఎన్‌జీసీ కాంట్రాక్ట్ కార్మికులు జననేత వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తానని కార్మికులకు వైఎస్ జగన్ భరోసా కల్పించి ముందుకు సాగుతున్నారు.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొమరగిరి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించిన వైఎస్ జగన్ యానాం చేరుకున్నారు. సుంకరపాలెం, చింతకులవరిపేట, ఇంజారం మీదుగా కోలంక వరకు వైఎస్ జగన్ పాదయాత్ర సోమవారం కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment