సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సాగుబడి పడిపోతోంది. గత ఏడాదితో పోల్చిచూస్తే వెనక్కి పోతోంది. ఒక పక్క వర్షాభావ పరిస్థితులు, మరోవైపు ఇప్పటికీ సాగునీరు విడుదల కాని దుస్థితిలో ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకోవాలి. కానీ దీనికి భిన్నంగా పొలాలు బీళ్లుగా మారిపోతున్నాయి. చెరువులు, కుంటల్లో నీళ్లు అడుగంటాయి.
మాగాణి భూములు కూడా బీటలువారాయి. ఖరీఫ్‌కు సంబంధించి బలమైన కార్తెలు వెళ్లి పోయాయి. ఖరీఫ్ అదును దాటింది. రబీ సీజన్ రబీలోనైనా అదును ఇచ్చి సకాలంలో రెండో పంటలు వేస్తామా అన్న సందేహంలో రైతులున్నారు. ఇటీవల వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిసినప్పటికీ పశ్చిమ ప్రకాశంలో వర్షాలు పడలేదు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జోన్ -2కి నీరు విడుదల చేశారు. దీనివల్ల కొంత ప్రయోజనం ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు.
‘సా...గు’తోంది
Published Sat, Sep 13 2014 2:08 AM | Last Updated on Fri, Oct 19 2018 7:23 PM
Advertisement