- ఏడీఏ కార్యాలయంలో ఇదో సమస్య
- ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న ఉద్యోగులు
- వేళకు రాక వ్యవసాయదారులకు ఇక్కట్లు
- అన్నిటికీ అటెండరే దిక్కు
- ఏడాదిగా విద్యుత్ కూడా కట్
అరకు రూరల్ : గిరిజన రైతులకు వారి సల హాలు, సూచనలు ఎంతో అవసరం. వారి సేవలు అతి ముఖ్యం. కానీ ఆ ఉద్యోగుల నుంచి అందే సాయం మాత్రం స్వ ల్పం. కా రణం.. వారు నగరంలోనో, ఇతర పట్టణాల్లోనో ఉంటూ పని చేసే చోటుకు రాకపోకలు సాగిస్తూ ఉండడమే. సకాలంలో వారు రాకపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతోంది. అరకులోయ కేంద్రంగా అనంతగి రి, డుంబ్రిగుడ, హుకుంపేట, అరకులోయ మండలాల గిరిరైతులకు సకాలంలో సలహా అందే అవకాశం లేకుండా పోతోంది.
అరకులోని సహాయ వ్యవసాయ సంచాలకుల కా ర్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం గిరిజన రైతులను నష్టపరుస్తోంది. ఈ సబ్ డివిజన్ కార్యాలయంలో సహాయ వ్యవసాయ సంచాలకుడు, ఏడీఏకు పీఏ, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, నలుగురు పర్మినెం ట్ మజ్దూర్‌లు, ఒక అటెండర్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం అటెం డర్, నలుగురు పర్మినెంట్ మజ్దూర్‌లే సకాలంలో కార్యలయానికి వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు.
సహాయ వ్యవసాయ సంచాలకు డు (ఏడీఏ) ఎన్. నాగపద్మారావు విశాఖలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తుంటే, ఇన్‌చార్జి పీఏ సృజన మాత్రం పెందుర్తి నుం డి వస్తూపోతుంటారు. డుంబ్రిగుడ వ్యవసాయ శాఖ అధికారిగా ఉన్న ఆమె అరకులోయ ఇన్‌చార్జి వ్యవసాయ శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారులు లేక కార్యాలయానికి వచ్చిన రైతులు నిరాశతో వెళ్తున్నారు. సిబ్బంది లేక కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
చీకటిలో కార్యాలయం
నియోజకవర్గ కేంద్రంలోని సహాయ వ్యవసాయ సంచాలకుడి కార్యాలయం ఏడాదిగా అంధకారంలో మగ్గుతోంది. సుమారు రూ. 30 వేల వరకు కరెంటు బిల్లు బకాయి ఉండటంతో గత ఏడాది విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్ కట్ చేశారు. దాంతో ఇక్కడ పనులేం జరగడం లేదు. జీతాల బిల్లులకు సంబంధించిన పనులను జేడీ కార్యాలయం లో ప్రతి నెలా చేపడుతున్నారు. చుట్టూ తుప్పలు పెరిగి, చెట్ల మధ్యలో ఉన్న కార్యాలయం అంధకారంలో ఉంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక్కడ పరిస్థితులు చక్కబరచాలని స్థానికులు కోరుతున్నారు.