సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2282 చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,713 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 52 మందికి పాజిటివ్ నిర్దారణ అయిందని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 12, నెల్లూరులో 7, తమిళనాడు కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవారు 19 మంది ఉన్నారు. (భారత్‌లో రికార్డు బ్రేక్ చేసిన కరోనా)
గత 24 గంటల్లో వైరస్ నుంచి కోలుకుని 94 మంది డిశ్చార్జి అయ్యారు. వీరిలో గుంటూరులో 40, కర్నూలు 28, కృష్ణా 20, చిత్తూరు 5, తూర్పుగోదావరి 4, విశాఖపట్నం 4, అనంతపూర్ 2, కడపలో ఒక్కరు ఉన్నారు. ఆదివానం ఒక్కరు కూడా కోవిడ్ వల్ల మరణించలేదు. కాగా కరోనా కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 మంది మరణించగా, 705 మంది చికిత్స పొందుతున్నారు.1527 మంది డిశ్చార్జి అయ్యారు. (అమెరికాలో 161 మంది భారతీయులు అరెస్ట్! )
Comments
Please login to add a commentAdd a comment