డ్వామా పీడీగా వెంకటేశ్వర్లు | Otherwise considered costs | Sakshi
Sakshi News home page

డ్వామా పీడీగా వెంకటేశ్వర్లు

Published Tue, Feb 4 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

Otherwise considered costs

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్ అధికారిగా డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు వస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్‌లో చేపట్టిన బదిలీల్లో భాగంగా జిల్లాలో డ్వామా పీడీగా పనిచేస్తున్న హైమవతిని హైదరాబాద్‌లోని విపత్తుల నివారణ సంస్థ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఆమె స్థానంలో వెంకటేశ్వర్లు రానున్నారు. ప్రస్తుతం ఖమ్మం ఆర్డీఓగా పనిచేస్తున్న ఆయన నాలుగు నెలలుగా సెలవులో ఉన్నారు. అయితే వెంకటేశ్వర్లుకు పీఆర్ శాఖ నుంచి పోస్టింగ్ ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

పదోన్నతి జాబితా లో ఉన్న హైమవతి కొద్ది రోజుల క్రితమే బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు తీవ్ర ప్రయత్నాలు చేశారు. జిల్లాలో రెండున్నరేళ్లుగా తిరుగులేని అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ ఆడిట్(సామాజిక తనిఖీ) లో బయట పడ్డ అక్రమాల ఆధారంగా సుమా రు 200 మంది వరకు వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగలను విధుల నుంచి తప్పించారు.

శాఖ పనితీరు గాడిలో పెట్టేందుకు అన్నివిధాలా కృషిచేశారు. పీడీ తీరు కొందరికి ఇబ్బందిగా మారడంతో ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఇటీవల జరిగిన డీఆర్‌సీలో పీడీ తీరుపై పలువురు నేతలు మండిపడ్డారు. అయినా తనపని తాను చేసుకుపోయారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మేడారం జాతర తర్వాతనే హైమవతి విధుల నుంచి రిలీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement