ప్రశాంతంగా సిరిమానోత్సవం
విజయనగరం క్రైం: పైడితల్లమ్మ సిరిమానోత్సవం మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి పోలీ సులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం పూట పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించా రు. ప్రతి క్యూలైన్‌ను పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ స్వయంగా పరిశీలించి భక్తులకు ఎటువంటి ఇబ్బందు లు తలెత్తకుండా చేశారు. పైడితల్లమ్మ గుడి వద్ద విజయనగరం డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఎస్‌పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్, అడిషనల్ ఎస్పీ ఎ.రమణ బందోబస్తును పర్యవేక్షించారు. సిరిమాను తిరిగే పైడితల్లమ్మ గుడి నుంచి కోట వరకు సుమారు 500 మంది సిబ్బందిని నియమించారు.
సిరిమాను తిరగక ముందు ఒకసారి ఎస్‌పీ నవదీప్‌సింగ్ గ్రేవల్, రెండుసార్లు అదనపు ఎస్పీ ఎ.వి.రమణ సిరిమాను తిరిగే ప్రాంతంలో ఉన్న బందోబస్తును పర్యవేక్షించారు. సిరిమాను తిరిగే ప్రాంతమంతా పోలీసు బలగాలను మొహరించారు. సిరిమాను తిరగక ముందు ఎస్‌పీ సిరిమాను వద్ద ఉండగా, అడిషనల్ ఎస్పీ కోట వద్ద ఉండి బందోబస్తును పరిశీలించారు. పైడితల్లమ్మ గుడి వెనుక భాగంలో భక్తులు బారీకేడ్లుపై పడి ముందుకు రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు నిలువరించారు. గురజాడ అప్పారావు రోడ్డులో ఆకతాయిలు మహిళలపై పడడంతో పోలీసులు వారిని తరిమారు. కొన్ని సందర్భాలలో భక్తులు సిరిమాను తిరిగే ప్రాంతంలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు నిలువరించారు.మొత్తంగా ప్రశాంతంగా సిరిమానోత్సవం ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎస్‌పీని గార్డులతో మూసిన పోలీసులు
సిరిమాను మొదటిసారి తిరిగిన సమయంలో ఎస్‌పీ నవదీప్‌సింగ్‌గ్రేవాల్ కోట వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో సిరిమాను కోట వద్దకు రావడంతో భక్తులు అరటిపళ్లను పూజారిపై విసిరారు. ఈ సమయంలో ఎస్‌పీకి సెక్యూరిటీగా వచ్చిన సిబ్బంది గార్డులతో ఆయనను మూసి భద్రతగా నిలిచారు. సిరిమానోత్సానికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. పట్టణంలోకి వచ్చే వాహనాలు, ట్రాఫిక్ ఆంక్షలను పక్కాగా అమలు చేయడంలో పోలీసులు సఫలీకృతులయ్యూరు.
విజయనగరం మున్సిపాలిటీ: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సహాయ, సహాకారాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను మొత్తం లక్షన్నర మంది సందర్శించారు. మూడు లక్షల రూపాయల వ్యయంతో స్థానిక మహారాజ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సోమ, మంగళవారాల్లో భక్తుల సందర్శనార్ధం ఏర్పాటు చేశారు. ఇందు లో భాగంగా తొలేళ్లు జరిగిన సోమవారం సుమారు లక్ష మంది భక్తులు సందర్శనకు వచ్చినట్లు అధికారు లు అంచనా వేస్తుండగా సిరిమానోత్సవం జరిగిన మంగళవారం మరో 50 వేల మంది సందర్శించినట్లు చెబుతున్నారు. తొలి రోజు ప్రదర్శనలో ఉంచిన బౌన్సా యి మొక్కలు, గ్లాస్ పెయింటింగ్స్, బుద్ధుడు, వినాయక విగ్రహాలు, కూరగాయలతో చేసిన వివిద ఆకృతుల ప్రదర్శనలు, అమ్మవారి సైకత శిల్పం ప్రదర్శనల్లో ఎటువంటి మార్పు లేకపోగా... ఐస్‌తో తయారు చేసిన వినాయక ప్రతిరూపం అందరినీ ఆకట్టుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఆయా శాఖల పరంగా లబ్ధిదారులకు సబ్సిడీపై అందజేసే ఉత్పత్తులను రెండవ రోజు ప్రదర్శనలో కొనసాగించారు. ఈ ప్రదర్శనను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎన్.మోహనరావు, జిల్లా ఉద్యానశాఖ సహాయ సంచాలకులు పి.లక్ష్మణప్రసాద్ పర్యవేక్షించారు.
కిక్కిరిసిన ఆర్టీసీ కాంప్లెక్స్
విజయనగరం అర్బన్: జిల్లా ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి పండుగ ఆర్టీసీకి సందడి తెచ్చింది. మూడు రో జులుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల రాకపోకలతో రద్దీ నెలకొంది. భక్తులకు రవాణా సేవలందించడంతో పాటు ఆదాయాన్ని తెచ్చుకొనే ప్రయత్నంలో ఆర్టీసీ అధికారులు నానాయాతన పడ్డారు. పార్వతీపురం, సాలూ రు, విశాఖ, శ్రీకాకుళం, పాలకొండ డిపోల అధికారులు, సిబ్బంది ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లోని ఆవరణలో విధులు నిర్వహించి సంబంధిత డిపో బస్సుల్లో ప్రయాణికులను దగ్గరుండి ఎక్కించి సేవలందించారు. దీంతో కాంప్లెక్స్ ప్రయాణికులతో కళకళలాడింది. భక్తులకు అందుబాటు లో సర్వీసులను అందజేస్తూ సంస్థకు ఆదాయాన్ని చేకూర్చడానికి ఆర్టీసీ అధికారులు కృషిచేశారు. జిల్లాలోని వివి ధ డిపోలనుంచి 150సర్వీసులను అదనంగా ఏర్పాటుచేసి సేవలను అందుబాటులో ఉంచారు. ప్రధానంగా విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, పాలకొండ, సాలూరు, పార్వతీ పురం వైపు ఏర్పాటు చేసిన సర్వీసుల నుంచి ప్రయాణికు ల రాకపోకలు అధికంగా సాగాయి. పట్టణానికి వచ్చిన బస్సులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రద్దీగా ఉ న్నాయి. సిరిమానోత్సవం తరువాత తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికులు పెరిగారు. సాయంత్రానికి ప్రయాణికుల రద్దీ పెరిగింది. బుధ, గురువారాలలో కూడా తిరుగు ప్రయాణ సర్వీసులను అందుబాటులో ఉంచుతామని డి ప్యూటీ సీటీఎం కె.శ్రీనివాసరావు తెలిపారు. సర్వీసుల ఏ ర్పాటులో ఆర్‌ఎం అప్పన్న, జోనల్ ఈడీ కార్యదర్శి వేణుగోపాల్, విజయనగరం డిపో మేనేజర్ పద్మావతి, స్టేషన్ మాస్టర్ రమేష్ తదితరులు తమ విధులు నిర్వహించారు.