ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో రెండు సర్పంచ్, రెండు వార్డు స్థానాలకు శనివారం ఉప ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా పంచాయతీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. సదాశివనగర్ మండలం పోసానిపేట, ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల గ్రామాల సర్పంచులు ఆకస్మికంగా మరణించడంతో ఈ సర్పంచ్ స్థానాలతో పాటు, వివిధ మండలాల్లో ఎన్నికలు జరగని 36 వార్డు స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్‌లు స్వీకరించిన అధికారులు వాటిని పరిశీలించి న అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
ప్రసుత్తం సదాశివనగర్ మండలం పోసానిపేట్ సర్పంచ్ స్థానానికి ఇద్దరు, ఎల్లారెడ్డి మం డలం అడవిలింగాల సర్పంచ్ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే వివిధ మండలాల్లోని 36 వార్డు స్థానాలకుగాను 29 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఐదు స్థానాలకు అభ్యర్థులెవరు నామినేషన్‌లు దాఖలు చేయకపోవడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించడంలేదు. మిగిలిన మద్నూర్ మండలం బండెకల్లూర్ గ్రామంలోని 3,9 వార్డు స్థానాల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు ఒక్కరోజే సమయం ఉన్నందున జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పంచాయతీ, రెవెన్యూ, పోలీ సు శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహిం చారు. పంచాయతీ అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు ఇతర సామగ్రిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
వెబ్ కెమెరాలను పోసానిపేట పోలింగ్ కేంద్రం లోనే ఏర్పాటు చేస్తున్నారు. మిగతా పోలింగ్ కేం ద్రాల్లో వాటిని ఏర్పాటు చేయడానికి సౌకర్యం లేదని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. వెబ్ కెమెరాలకు బదులు వీడియో చిత్రీకరణ చేయిస్తున్నామన్నారు.
మైక్రో పరిశీలకుల నియామకం
ఎన్నికలు జరిగే ప్రాంతాలను పర్యవేక్షించడానికి జిల్లాకు కేంద్ర ప్రభుత్వ అధికారులైన ముగ్గురు మైక్రో పరిశీలకులను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వు లు జారీ చేసింది. అడవి లింగాల గ్రామానికి శ్రీనివాస్‌రెడ్డిని, పోసానిపేట గ్రామానికి లింగం, బండెకల్లూర్ గ్రామానికి డి.రమేష్‌లు నియామకమయ్యారు. వీరు శుక్రవారం జిల్లాకు చేరుకుని ఎన్నికలు జరిగే ప్రాంతాలను తిరిగి పర్యవేక్షించనున్నారు. ఎన్నికలు జరిగే రోజు కూడా పర్యవేక్షణ చేస్తారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఏజేసీ, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర అధికారులు ఎన్నికల సరళిని పరిశీలిస్తారు.
పంచాయతీకి ‘రెడీ’
Published Fri, Jan 17 2014 5:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement
Advertisement