దేవిప్రియకు పతంజలి సాహితీ పురస్కారం | Patanjali literary award to Devipriya | Sakshi
Sakshi News home page

దేవిప్రియకు పతంజలి సాహితీ పురస్కారం

Published Sun, Mar 26 2017 2:45 AM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

దేవిప్రియకు పతంజలి సాహితీ పురస్కారం

దేవిప్రియకు పతంజలి సాహితీ పురస్కారం

విజయనగరం పూల్‌బాగ్‌ (విజయనగరం): పతంజలి సాహితీ పురస్కారానికి ప్రముఖ రచయిత, పత్రికల్లో రన్నింగ్‌ కామెంటరీ కాలమ్, గరీబు గీతాలు రచించిన దేవిప్రియ ఎంపికయ్యారు. ఈ అవార్డును ఆయనకు ఈ నెల 29న పతంజలి జయంతి సందర్భంగా అందజేయనున్నట్లు కేఎన్‌వై. పతంజలి సాంస్కృ తిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తెలిపారు.

సంస్థ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 29న జెడ్పీ సమావేశ మందిరంలో దేవిప్రియకు ఈ పురస్కారం అందజేస్తామని తెలిపారు. అదే రోజు ఉదయం 9 గంటలకు గురజాడ గ్రంథాలయం వద్ద పతంజలి విగ్రహం ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement