పెత్తందారులకు తొత్తుగా టీడీపీ
విజయనగరం ఫోర్ట్ : టీడీపీ ప్రభుత్వం పెత్తందారులకు తొత్తుగా మారిందని పీసీ సీ అధ్యక్షుడు ఎన్.రఘువీరెడ్డి ఆరోపిం చారు. కోటి సంతకాల సేకరణ కార్యక్ర మంలో భాగంగా సోమవారం జిల్లాకు వ చ్చిన ఆయన స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఆ ంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు సాధించే వరకు పోరాడాతామని స్పష్టం చేశారు. అరబిందో కంపెనీలో విధుల నుంచి తొల గించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగు లు ప్రశాంతంగా ఆందోళన చేపడితే వారిపై టీడీపీ ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించిందన్నారు. దీన్ని బట్టి చూస్తుం టే టీడీపీ ప్రభుత్వం పెత్తందారులకు మద్దతు పలుకు తున్నట్లు అర్థం అవుతోందని చెప్పారు. నవ్యాంధ్ర హితం కోరుతూ చేపట్టిన సంతకాల సేకరణ నాలుగు జిల్లాలో పూర్తయిందని తెలిపారు.
బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీ ల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి బీజేపీ మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ మొద లు పెట్టిన తర్వాత ఉద్యమాన్ని నీరు గార్చాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ కోసం రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. దేశంలోనే శక్తివంతమైన ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ప్రధాని మోడీని నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు ప్రత్యేకహోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ప్రత్యేక హోదాపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. అంతకుముందు ఇటీవల జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు వల్లూరి శ్రీనువాస్‌రావు , రామకృష్ణ, టి.వెంకటలక్ష్మి, బంగాారు ఉషలను అభినందించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి కుంతియాజ్, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎంపీలు ఝాన్సీలక్ష్మి, కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యేలు అప్పలనరసయ్య, అప్పలనాయుడు, డీసీసీ అధ్యక్షుడు పిళ్లా విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
వదిలే ప్రసక్తే లేదు..
గజపతినగరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే వరకూ పోరాటం ఆపే ప్రసక్తే లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున కోటి సంతకాల సేకరణలో భాగంగా స్థానిక నాలుగురోడ్ల జంక్షన్ వద్ద జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకు ఐదేళ్ల పాటు ప్రత్యేకహోదా కల్పించాలని ప్రతిపాదించగా, బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు దాన్ని పదేళ్లకు పెంచాలని పట్టుబట్టి సాధించుకున్నారని చెప్పారు. ఇప్పుడేమో ఆయన మాట మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్రకు 24,350 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చట్టం చేయగా నేడు కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ. 50 కోట్లు కేటాయించడం దారుణమన్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, సమన్యాయం అంటూ ఆఖరి క్షణ వరకు తప్పించుకుని తిరిగిన చంద్రబాబు చివరికి ఆ పాపం కాంగ్రెస్ మీద వేయడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కిళ్లి కృపారాణి, రాష్ట్ర పరిశీలకుడు రామచంద్ర కుంతియా, మాజీ మంత్రి కోండ్రుమురళి, మాజీ ఎమ్మేల్యేలు, బొత్స అప్పలనరసయ్య , సంబంగి చినప్పలనాయుడు, బడుకొండ అప్పల నాయుడు, డీసీసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్, యడ్ల.రమణమూర్తి, యడ్ల.ఆదిరాజు, తదితరులు పాల్గోన్నారు.