జి.సిగడాం మండలం చెట్టుపొదిలాంలో ఆదివారం జరిగిన జన్మభూమి గ్రామసభ ఓ వృద్ధురాలి దీనగాథ అందరినీ కలచివేసింది. తన పింఛను రద్దు చేశారని ఆ గ్రామానికి చెందిన కిల్లారి అమ్మన్నమ్మ... అధికారులు ముందు తన గోడు వెల్లబోసుకున్నా.. ఆమెకు చుక్కెదురే అయ్యింది. నిలబడడానికి ఓపిక లేకున్నా.. స్థానికుల సాయంతో వచ్చిన ఆమెను చూసిన అధికారులు కూడా అవాక్కయ్యారు. అయ్యో.. తల్లీ.. పింఛను రావట్లేదా?.. అంటూ ఆరా తీశారు. చివరికి రేషన్ కార్డు లేకపోవడంతో పింఛను మంజూ రు కాలేదని ఎంపీడీవో కె.హేమసుందరరావు వివరించారు.
రేషన్‌కార్డు ఉంటేనే పింఛనిస్తాం అంటూ తేల్చేశారు. దీం తో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఆమె.. ‘బాబూ... మీరు పించనిచ్చేసరికి నే పైకిపోతా.. మీ పించనుకో దండం.. మీ రేషన్‌కార్డుకో దండం’ అంటూ.. అక్కడే కూల బడిపోయింది. స్థానికులు ఆమెను లేవదీసి పక్కనే ఉన్న ఓ ఇంటి అరుగుపై పడుకోబెట్టి సేదతీర్చారు. ఈ సంఘ టనతో.. బాబూ జమానాలో రాజకీయ రాబంధుల హవా నడుస్తోందని... అర్హ త లేకున్నా.. పచ్చ చొక్కావారికే ప్రభుత్వ పథకాలు పట్టున వాలుతున్నా యని, అర్హత ఉన్నా రాజకీయ పరపతిలేని వారికి చుక్కలు కనిపిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానించారు.
-జి.సిగడాం
‘బాబూ’.. మీరు పింఛనిచ్చేసరికి పైకి పోతానేమో!
Published Sun, Jun 7 2015 11:44 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement