ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీకి జనాశీస్సులు ఉన్నాయని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈనెల 5వ తేదీన ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో నిర్వహించే జగన్ ‘జనభేరి’ బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన పార్టీ జనరల్ బాడీ సమావేశం లో పొంగులేటి మాట్లాడారు.
తెలంగాణలోనూ జగన్‌మోహన్‌రెడ్డికి జననీరాజనాలు ఖాయమన్నారు. సభను అడ్డుకునేందుకు కొందరు పన్నుతున్న కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. జగన్ తెలంగాణలో పర్యటిస్తే తమ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతోనే కొందరు కుట్రపూరిత చర్యలకు పాల్పడేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఈ కుట్రలను కార్యకర్తలు సంయమనంతో తిప్పికొట్టాలని సూచించారు. ఒకవేళ పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ సభ నిర్వహించి తీరుతామన్నారు.
కొందరు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని..ఇటువంటి వాటికి తలొగ్గొద్దన్నారు. తెలంగాణ కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు మరువరాద ని పార్టీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక కుట్రపూరిత చర్యలతో నిర్బంధించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఇంకా పార్టీ కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎడవల్లి కృష్ణ, మట్టా దయానంద్, నంబూరి రామలింగేశ్వరరావు, బాణోత్ మదన్‌లాల్, సామాన్యకిరణ్, తాటి వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, చంద్రశేఖర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్లు తోట రామారావు, మెండెం జయరాజు, భూక్యా దళ్‌సింగ్, జిల్లా నాయకులు ఆకుల మూర్తి, గురుప్రసాద్, సంపెట వెంకటేశ్వర్లు, చాగంటి రవీందర్‌రెడ్డి, కొదమసింహం పాండురంగాచార్యులు, కీసర పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీకి జనాశీస్సులున్నాయి..
Published Sun, Mar 2 2014 1:25 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM
Advertisement
Advertisement