సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్ అని అన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్‌ఫుల్ అని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు.
తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై ఖమ్మం నేతలతో సమీక్షించారు. ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కచ్చితంగా గెలవాల్సిందేనని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలను గెలిచామని, మరో 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయని తెలిపారు. కొన్ని స్థానాలను వివిధ కారణాలతో కోల్పోయామని కేటీఆర్ అన్నారు. ఆ కారణాలు తెలుసుకుని, సమీక్షించుకుని ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు చెప్పారు. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని పేర్కొన్నారు.
గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో తమ పోరాట పటిమ చూశారని కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే ఈనెల చివర్లో అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలు ఉంటాయన్నారు. త్వరలోనే రాష్ట్ర ,జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి రెండు, మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు.
చదవండి: TS: ఫార్ములా ఈ రేస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెల దాటింది. వచ్చిన తెల్లారినించే హామీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు కాలయాపన చేస్తుంది. ఎన్నికల ముందు కంటే భిన్నంగా కాంగ్రెస్ వ్యవహరించడంపట్ల ప్రజల్లో అసహనం మొదలైంది. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. గత నెల రోజుల పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment