సాక్షి, అనంతపురం: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 14మందిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు.వారి వద్ద నుంచి రూ. 79వేల నగదు, నాలుగు ఉంగరాలు, సెల్ఫోన్లు, టీవీని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ వెంక్రటావ్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. భారత్, న్యూజిలాండ్ టి20మ్యాచ్ సందర్భంగా రాణినగర్లో గోగుల రామాంజినేయులు అనే వ్యక్తి ఇంట్లో బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన వన్టౌన్, స్పెషల్ పార్టీ పోలీసులు అతని ఇంటిపై దాడులు జరిపారు.
ఈ దాడుల్లో రాణినగర్కు చిందిన షేక్ హైదర్వలి, రూరల్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందన బంగి సంగప్ప, పాతూరుకు చెందిన కరూరు నిజాముద్దీన్, మారుతినగర్కు చెందిన రామకృష్ణారెడ్డి, భాస్కర్, కాట్నేకాలువకు చెందిన మునీశ్వరరెడ్డి, అశోక్‌నగర్‌కు చెందిన నారాయణరెడ్డి, గడంగవీధికి చెందిన
హనుమంతరావు, రాణినగర్‌కు చెందిన మహబూబ్‌బాషా, దాదాఖలందర్, రాజమ్మకాలనీకి నారాయష్వామిలు పట్టుబడ్డారు.
వీరందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు స్టేషన్కు తరలించారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. పరారీలో ఉన్న వారిలో గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన రాజశేఖర్, వేమారెడ్డి ముఖ్యలు అని తెలిపారు. ఈ సమావేశంలో వన్టౌన్ సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ రంగయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment