సాక్షి, కృష్ణా: రైతు భరోసా పథకంలో భాగంగా ఏడాదికి ప్రతి రైతుకు రూ.13,500 అందించామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. పంట నష్టం వచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ చెల్లించేలా సీఎం జగన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు అన్నివేళలా రైతులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కరోనా కష్ట కాలంలోనూ రైతుకు అండగా నిలిచామని పేర్ని నాని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలనలోనే 90 శాతం హామీలు నెరవేర్చారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబునాయుడు.. విమర్శల బాబుగానే మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు కన్నా 40 ఏళ్ల యువకుడిగా సీఎం వైఎస్ జగన్ మెరుగైన పాలన అందిస్తున్నారని వెల్లంపల్లి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment