గూడూరు, న్యూస్‌లైన్: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గూడూరులోని వరదానగర్‌లో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం మధిరకు చెం దిన కటకం అచ్చయ్య కుమారుడు శ్రీకృష్ణ(43) గూడూరు సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో పల్స్‌పర్ మైన్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. ఏడు నెలల క్రితం వరదానగర్‌లోని శ్రీనివాసులురెడ్డి ఇంటి రెండో అంతస్తును అద్దెకు తీసుకున్నాడు. పనులు లేవని మూడు నెలల క్రితం సొంతూరు వెళ్లిపోయాడు. అద్దె చెల్లించాలని ఇంటి యజమాని ఫోన్ చేయడంతో వారం రోజుల క్రితం గూడూరు వచ్చాడు. అనంతరం ఏమి జరిగిందో ఏమో ఆదివారం శవమై కనిపించాడు. పక్కింటి వారు నీళ్ల ట్యాంకు శుభ్రం చేసేందుకు తమ మిద్దపెకైళ్లగా దుర్వాసన వెదజల్లింది. అనుమానంతో వారు ఇంటి యజమాని శ్రీనివాసులురెడ్డికి సమాచారం ఇచ్చారు.
ఆయన పోలీసులను ఆశ్రయించడంతో ఒకటో పట్టణ ఎస్‌ఐ షరీఫ్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం ఉబ్బిపోయి దుర్వాసన వెదజల్లుతుండటంతో నాలుగైదు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అందులోని నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు. ఆ గదిలో లభించిన మృతుడి ఇన్సూరెన్స్‌పాలసీకి సంబంధించిన కాగితాల్లో శ్రీకృష్ణ, తండ్రి అచ్చయ్య, రామకోటి3-5-32, హైదరాబాద్ అనే చిరునామా కూడా ఉంది. శ్రీకృష్ణను ఎవరైనా హత్య చేశారా, లేక ఆత్మహత్యకు పాల్పడ్డా డా అనే కోణాల్లో పోలీసులు కేసు ద ర్యాప్తు చేపట్టారు. ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీం సేవలు వినియోగించుకుంటున్నారు.
పోలీసులకు సవాల్‌గా కేసులు
గూడూరులో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఏప్రిల్ 7వ తేదీన దర్గావీధిలోని ఓ ఇంట్లో తల్లీకూతురు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన వెనుక మిస్టరీ ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. జూలై 8న బజారువీధి ప్రాంతంలో మిర్చివ్యాపారి దుగ్గిశెట్టి కృష్ణయ్య పట్టపగలే హత్యకు గురయ్యాడు. ఈ కేసులోనూ నిందితుల జాడ లేదు. ఈ క్రమంలో శ్రీకృష్ణ మృతికేసు పోలీసులకు సవాల్‌గా మారనుంది.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
Published Mon, Sep 23 2013 4:28 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement